
డాకు మహారాజ్ సినిమాతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఆ సక్సెస్ జోష్‌తోనే ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ తాండవంలో నటిస్తున్నారు. బోయపాటి - బాలయ్య సినిమాలకున్న క్రేజ్‌కి అద్దం పట్టేలా తెరకెక్కుతోందట అఖండ తాండవం. బాలయ్య ఉపయోగించే ఆయుధాల నుంచి ప్రతిదీ జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారట బోయపాటి.

అఖండ తాండవం కంప్లీట్ కాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారన్నది ఇప్పటివరకున్న అప్‌డేట్. వీరసింహారెడ్డిలో బాలయ్యను మరో రేంజ్‌లో చూపించారు గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఆ సినిమాకి డబుల్ అన్నట్టు స్క్రిప్ట్ చెప్పారట ఈ కెప్టెన్.

గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్ కావడానికి ముందు, కొన్నాళ్ల పాటు జైలర్ సినిమాకు కాల్షీట్ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్‌లో కీ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు నందమూరి నట సింహం.

అయితే వీటన్నిటికన్నా ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరక్టర్‌తో ఓ సినిమా చేసే అవకాశం ఉందన్నది లేటెస్ట్ న్యూస్. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కి సూపర్ హిట్ ఇచ్చారు అధిక్ రవిచంద్రన్.

ఆయన చెప్పిన మాస్ సబ్జెక్ట్ కి బాలయ్య టిక్ మార్క్ పెట్టేశారట. మరో మంచి కథతో ముందుకొస్తే బాబీతోనూ సినిమా చేయడానికి రెడీ అన్నారు గాడ్ ఆఫ్ మాసెస్. దీన్ని బట్టి బాలయ్య లైనప్ యమా స్ట్రాంగ్‌గా ఉందని ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.