
ఇన్నాళ్లూ ఆ క్లబ్‌లో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు.. ఒంటరివాడైపోయాడు అంటూ అభిమానులు తెగ ఫీలైపోయారు. నువ్ ఒంటరి కాదు.. నీకు తోడు నేనున్నా అంటూ ఇప్పుడు పవన్‌కు తోడుగా బాలయ్య కూడా బయల్దేరారు. కేవలం పవన్ మాత్రమే చేసే ఈ పని కొన్ని రోజుల నుంచి NBK చేస్తున్నారు. అసలు పవన్, బాలయ్య ఎందుకెళ్లారు.. ఏం చేస్తున్నారు..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

టాలీవుడ్‌లో సినిమాలతో పాటు రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడన్నట్లుంటుంది పరిస్థితి. ముఖ్యంగా పవన్ పాలిటిక్స్‌లోకి వెళ్లాక.. ఈ ఎఫెక్ట్ ఇంకాస్త బలంగానే ఇండస్ట్రీపై ఉంది. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు పొలిటికల్ హీట్ బాగానే తగులుతుంది.

4 నెలలుగా పవన్ షూటింగ్స్‌కు దూరంగానే ఉన్నారు. మరో మూడు నాలుగు నెలలు రానని కూడా ముందే చెప్పారు. మే నుంచి ఓజి సెట్‌లో జాయిన్ కానున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయనకు బాలయ్య కూడా తోడయ్యారు. ఉన్నపలంగా చేస్తున్న సినిమాను వదిలేసి.. ఎన్నికల కోసం బయల్దేరారు NBK. దాంతో బాబీ సినిమాకు భారీ బ్రేక్ తప్పేలా లేదు.

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చే హీరోగా పవన్ మాత్రమే ఉన్నారు. ఎప్పుడు సినిమాలు చేస్తారో.. ఎప్పుడు రాజకీయమంటూ వెళ్తారో క్లారిటీ ఉండేది కాదు నిర్మాతలకు. ఇప్పుడు బాలయ్య కూడా వచ్చేసారు. ఏపీలో ఎన్నికల వేడి పెరగడంతో.. బాబీ సినిమాను పక్కనబెట్టారు నటసింహం. చూస్తుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్‌కు కానీ దీనికి మోక్షం వచ్చేలా లేదు.

బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా.. తన సినిమాలకు ఇబ్బంది రాకుండా ఇన్నాళ్లూ చూసుకున్నారు. కానీ మెయిన్ ఎలక్షన్స్ రావడంతో బ్రేక్ ఇవ్వక తప్పట్లేదు. ఎన్నికలవ్వగానే.. బాబీ సినిమాను పూర్తి చేయనున్నారు బాలయ్య. మరోవైపు పవన్ కూడా ఓజితో పాటు హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు ఏపీలో ఎన్నికల వేడి తగ్గాలి.