- Telugu News Photo Gallery Cinema photos Bala krishna vs Pawan Kalyan Dussehra Box Office Clash Confirmed
తగ్గేదే లే అంటున్న బాలయ్య.. దసరా బరిలో బిగ్ క్లాష్ తప్పేలా లేదు
ఏడాది సమ్మర్ సీజన్ ని రాస పరిచిన దసరా బరిలో మాత్రం బిగ్ నేమ్స్ ఫ్లాష్ అవుతున్నాయి. ఇద్దరు మాస్ స్టార్స్ తగ్గేదే లే అంటూ బరిలో దిగుతూ ఉండటంతో దసరా సీజన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ దసరా బరిలో కాళ్ళు దివ్వతున్న ఆ హీరోలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. పదండి. వరుస సక్సెస్ లతో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహం నెక్స్ట్ అఖండ 2
Updated on: Jun 21, 2025 | 10:25 AM

వరుస సక్సెస్ లతో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహం నెక్స్ట్ అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే షూటింగ్ స్టార్ట్ అయిన రోజే రిలీజ్ డేట్ లాక్ చేసి పక్కా ప్లాన్ తో బరిలో దిగుతున్నారు బాలయ్య. సెప్టెంబర్ 25 న అఖండ 2 రిలీజ్ అన్న అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు అదే డేట్ కు ఓజీ తో బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్.

ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో సెప్టెంబర్ రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలకి ఛాన్స్ లేదు. పవన్ మూవీ దసరా బరిలో దిగుతుందన్న న్యూస్ రావడంతో అఖండ 2 రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందా అన్న చర్చ జరిగింది.

ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు బాలయ్య. షూటింగ్ స్టార్ట్ కాకముందే అఖండ 2 హిట్ అని కన్ఫామ్ అయిపోయింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చేసి చెప్పారు బాలయ్య.

బాలయ్య అంత పక్కగా ఫిక్స్ అవ్వడంతో దసరా బరిలో బిగ్ క్లాష్ తప్పేలా లేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోలు ఒకే డేట్ కు వస్తుండటంతో ఆ రోజు థియేటర్ల దగ్గర సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ఈ రోజు నుంచే అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.




