- Telugu News Photo Gallery Cinema photos Audience reaction on raghava lawrence and kangana ranaut movie chandramukhi 2 Trailer Telugu Entertainment Photos
Chandramukhi 2: నిరాశపరిచిన చంద్రముఖి 2 ట్రైలర్.. సేమ్ అలానే ఉంది అంటూ కామెంట్స్.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ చంద్రముఖి. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు 17 ఏళ్ల తరువాత సీక్వెల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. రాఘవ లారెన్స్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ ఆడియన్స్‌కు కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఇక రజనీకాంత్ పని అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో చంద్రముఖి సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు తలైవా. అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమాకు..
Updated on: Sep 04, 2023 | 4:04 PM

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ చంద్రముఖి. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు 17 ఏళ్ల తరువాత సీక్వెల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.

రాఘవ లారెన్స్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ ఆడియన్స్‌కు కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఇక రజనీకాంత్ పని అయిపోయింది అనుకుంటున్న టైమ్‌లో చంద్రముఖి సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు తలైవా.

అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కానీ పార్ట్ 2 ఆడియన్స్ ముందుకు రావడానికి 17 ఏళ్ల సమయం పట్టింది.చంద్రముఖి సినిమాను రూపొందించిన పీ వాసు సీక్వెల్‌ను కూడా తెరకెక్కించారు.

కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషింంచిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటించారు. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న చంద్రముఖి 2 ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

చంద్రముఖి 2 ట్రైలర్ చూసిన ఆడియన్స్ ఇంతేనా అంటూ పెదవి విరుస్తున్నారు. పార్ట్ 2 ట్రైలర్ చూశాక సీక్వెల్ కథ కూడా దాదాపు తొలి భాగం కథలాగే అనిపిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ ప్లేస్‌లో లారెన్స్, జ్యోతిక ప్లేస్‌లో కంగనా తప్ప మిగతా కథ అంతా యాజిటీజ్‌గానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఓ బంగ్లాలో దక్షిణం గది అక్కడే చంద్రముఖి సమస్య, అది తెరవటంతో మలుపు తిరిగే కథ, క్లుప్తంగా చంద్రముఖి 2 కథ కూడా ఇదే.

పార్ట్‌లో వన్‌లో కనిపించిన స్వామిజీని పోలిన పాత్ర కూడా సీక్వెల్‌లో కనిపించటంతో యాజిటీజ్‌గా ఉందంటున్నారు ఆడియన్స్. మరి ఫుల్ మూవీలో అయినా వేరియేషన్ చూపిస్తారా..? లేదంటే పాత కథతోనే ఉసూరుమనిపిస్తారా..? అన్నది బిగ్ స్క్రీన్ మీద చూడాలి





























