- Telugu News Photo Gallery Cinema photos Ashika Ranganath latest gorgeous photos got viral in social media
Ashika Ranganath: మన్మధుని భార్యని నమూనా చేసి.. ఈ వయ్యారికి పాలతో ప్రాణం పోసాడేమో ఆ బ్రహ్మ..
అమిగోస్, నా సామీ రంగ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. వీటికి ముందు తమిళం, కన్నడలో కొన్ని చిత్రాల్లో కథానాయకిగా మెప్పించింది. కర్ణాటకలోని తుమకూరులో జన్మించిన ఈ వయ్యారి తన అందం, అభినయంతో కుర్రాళ్లను మనసులు దోచేస్తుంది. అలంటి ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Apr 08, 2024 | 10:16 AM

5 ఆగస్టు 1996న కర్ణాటకలోని తుమకూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో రంగనాథ్ మరియు సుధా రంగనాథ్ దంపతులకి వయ్యారి భామ ఆషికా రంగనాథ్. ఆమెకు ఒక అక్క అనూషా రంగనాథ్ ఉన్నారు. ఆమె కూడా కన్నడ సినిమాలలో నటి.

తుమకూరులోని బిషప్ సార్గంత్ స్కూల్‌లో పాఠశాల విద్యని పూర్తి చేసింది అందాల తార. తరువాత ఈ ముద్దుగుమ్మ ప్రీ-యూనివర్శిటీ కోసం బెంగళూరుకు వెళ్లి జ్యోతి నివాస్ కాలేజీలో కళాశాల విద్య అభ్యసించింది.

కాలేజీలో చదువుతున్న సమయంలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీకి ఆడిషన్ చేసింది, మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది. నటనతో పాటు, ఆమె ఫ్రీస్టైల్, బెల్లీ మరియు వెస్ట్రన్‌తో సహా పలు డ్యాన్స్ లలో శిక్షణ పొందింది.

దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసి తాను డైరెక్ట్ చేసిన క్రేజీ బాయ్ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చారు. ఆలా ఆషికా కెరీర్‌లో నటన ప్రారంభమైంది. తర్వాత కొన్ని తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది.

2023లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్ సినిమా హీరోయిన్ గా టాలీవుడ్ చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత 2024లో సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామీ రంగ సినిమాలో సీనియర్ హీరో నాగార్జునకి జోడిగా కనిపించింది. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.




