Anupama Parameswaran: ఈ ఏడాది కూడా జోరుమీదున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్..

| Edited By: Phani CH

Mar 20, 2025 | 7:59 PM

పది రాళ్లు వేస్తే ఒక్క రాయి తగిలినా గొప్పే కదా అనే మాట వింటుంటాం. ప్రతి రాయీ పదే పదే తగులుతూ ఉంటే ఫలితాలు వావ్‌ అనిపిస్తాయి కదా అన్నది అనుపమ పరమేశ్వరన్‌ ఆలోచన. లాస్ట్ ఇయర్‌ ఆమె మూడు రాల్లు విసిరితే ఒక్కటే తగిలింది. ఈ ఏడాది ఆల్రెడీ ఒకటి సక్సెస్‌ అయింది.. మిగిలిన వాటి సంగతేంటి?

1 / 5
లాస్ట్ ఇయర్‌ టిల్లు స్క్వేర్‌తో దుమ్మురేపేశారు అనుపమ పరమేశ్వరన్‌. ఇప్పటిదాకా మనం చూసిన హీరోయిన్‌ ఈమేనా?  లేకుంటే.. ఈమె అనుపమ 2.0నా? అని అందరూ ఆశ్చర్యపోయేలా పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపేశారు.

2 / 5
ఇప్పుడు అదే జోరును డ్రాగన్‌తో కంటిన్యూ చేశారు.  తమిళ సినిమా డ్రాగన్‌ మన దగ్గర కూడా కలెక్షన్లు కొల్లగొట్టేసింద. అనుపమ కేరక్టర్‌కి మరోసారి ఫిదా అయ్యారు మన జనాలు.

3 / 5
2025లో పర్ఫెక్ట్ బోణీ పడింది.. ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు అనుపమ. నెక్స్ట్ లిస్టులో ఉన్న ఆమె సినిమాల్లో పరదా మీద చాలా పెద్ద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

4 / 5
లిస్టులో ఉన్న అన్నీ సినిమాలూ కంప్లీట్‌ కాగానే శతమానం భవతి కాంబోలో సినిమా చేయడానికి ఈ బ్యూటీ ఓటేసినట్టు సమాచారం. శర్వానంద్‌ హీరోగా సంపత్‌నంది డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.

5 / 5
ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయింది. సంపత్‌ నంది చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్‌తో నటించడానికి అనుపమ ఓకే చెప్పేశారట. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోకి మూవీ లవర్స్  మధ్య మంచి క్రేజ్‌ ఉంది. దానికి తగ్గట్టు కథ కూడా బావుంటే హిట్‌ రేంజ్‌ వేరే రేంజ్‌లో ఉంటుందని డిస్కషన్‌ షురూ చేసేశారు నెటిజన్లు.