
ఎన్నాళ్లుగానో వేచిన క్షణం రానే వచ్చింది.. బిగ్ వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ కల్కి 2898ఏడీలో బిగ్ బీ కేరక్టర్‌ని రివీల్ చేసింది టీమ్. కల్కి సినిమాలో బిగ్ బీ కేరక్టర్ ఏంటనే దాని మీద చాన్నాళ్లుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది.

ఇకపై అందరూ ఆయన్ని ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్దామాగా గుర్తుపెట్టుకుంటారు. యస్.. కల్కి చిత్రంలో అశ్వద్దామాగా నటించారు బిగ్ బీ. మహాభారతంతో మొదలయ్యే కథ.. 2898ఏడీతో పూర్తవుతుందని ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు కెప్టెన్ నాగ్ అశ్విన్.

ఈ సినిమాలో మహాభారతం పోర్షన్‌లో అలాగే ఫ్యూచర్‌లోనూ కనిపిస్తారు అమితాబ్ బచ్చన్. మరి ఆ కేరక్టర్ ఫ్యూచర్‌లోనూ కనిపిస్తుంది.? అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి.

అశ్వద్దామా మన డార్లింగ్‌కి ఎలా కనెక్ట్ అవుతారు? ఏ రకంగా సాయం చేస్తారు? ఏ విషయంలో అండగా నిలుచుంటారు అనేది రెబల్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.నిన్నటిదాకా విడుదల తేదీ వాయిదా మీద చర్చ వినిపించింది. అమితాబ్ గ్లింప్స్ లో దానికి సంబంధించి ఓ క్లారిటీ వస్తుందని ఆశించారు మేకర్స్.

అయితే మేకర్స్ ఏం చెప్పదలచుకున్నారో, ఆ విషయాన్ని మాత్రమే స్పష్టంగా చెప్పారనే విషయం మీద జనాలకు ఓ ఐడియా వచ్చేసింది. అన్నీ ఒకేసారి చెబితే ఎలా? ఊరించి, ఊరించి చెబితే ఆ మజా ఇంకో రకంగా ఉంటుందని అంటున్నవారు కూడా లేకపోలేదు.