
ఏం చెప్తున్నాడో.. ఏం చెప్పి ఒప్పిస్తున్నాడో తెలియదు కానీ బుచ్చిబాబు పేరు ఇండియన్ వైడ్‌గా మార్మోగిపోతుందిప్పుడు. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే RC16ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఈ చిత్ర కాస్ట్ అండ్ క్య్రూ చూస్తుంటే బుచ్చిబాబు కాస్తా బాహుబలి ఇంటర్వెల్ సీన్‌లో ప్రభాస్‌లా కనిపిస్తున్నారు. అసలింతకీ అంతగా ఈయనేం చేస్తున్నారో తెలుసా..?

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నారు బుచ్చిబాబు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కనబెడితే.. ముందు ఈ ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరి బుర్ర గిర్రున తిరుగుతుంది. చాలా మంది దర్శకులు కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ RC16కి కలిపేస్తున్నారు బుచ్చిబాబు.

రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఓకే అయినపుడే దీనిపై చర్చ మొదలైంది. అంతలోనే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటూ మరో బాంబ్ పేల్చారు బుచ్చి. ఆ షాక్ నుంచి బయటికి రాకముందే శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి అంటూ RC16 క్యాస్టింగ్ గుట్టు విప్పి మరో షాక్ ఇచ్చారు. ఇప్పుడేమో ఏకంగా అమితాబ్ బచ్చన్‌నే లైన్‌లోకి తీసుకొస్తున్నారీ దర్శకుడు.

RC16లో తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను ఒప్పించే పనిలో పడ్డారు బుచ్చిబాబు. బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వడంతో.. కాస్టింగ్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ దర్శకుడు. సైరా తర్వాత కల్కిలో భాగం అయ్యారు అమితాబ్. ఇప్పుడు చరణ్ సినిమాలో తాత పాత్రలో బిగ్ బి నటించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

RC16లో కేవలం కాస్ట్ అండ్ క్య్రూకే భారీగా ఖర్చు పెడుతున్నారు. రామ్ చరణ్ 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటుంటే.. బుచ్చిబాబు, జాన్వీ కపూర్, రెహమాన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. సమ్మర్ 2025లో RC16 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది.