
గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఏఏ 22. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన అట్లీ త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

అదే సమయంలో ఒక్కో అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో బన్నీ నాలుగు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఐదుగురు హీరోయిన్స్ తెర మీద కనిపిస్తారన్న టాక్ ఉన్నా... ఇప్పటి వరకు ఒక్క దీపిక పదుకోన్‌ను మాత్రం అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు.

ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్న హింట్ ఇచ్చింది ఏఏ 22 టీమ్. అట్లీతో వీడియో కాల్ మాట్లాడుతున్న స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు సాయి అభ్యంకర్. ఈ ఫోటోకు ఆన్‌లైన్ జాన్ అంటూ పేలేందుకు రెడీ గా ఉన్న ఓ బాంబ్ సింబల్‌ను యాడ్ చేశారు. దీంతో ఈ డిస్కషన్ ఏఏ 22 గురించే అని కన్‌క్లూజన్‌కు వచ్చేశారు ఫ్యాన్స్.

అదే ఫోటోను అట్లీ కూడా తన స్టోరీలో షేర్ చేయటంతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఏఏ 22. మ్యూజిక్ సింగిల్స్‌తో పాపులర్ అయ్యారు సాయి అభ్యంకర్. ఆయన మ్యూజిక్ చేసిన ఒక్క సినిమా కూడా ఇంత వరకు రిలీజ్ కాలేదు.

అయినా ఇంత క్రేజీ ప్రాజెక్ట్‌ను అతని చేతిలో పెట్టడం మీద నేషనల్ లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమా మాత్రమే కాదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు ఎనిమిది సినిమాలకు సంగీతమందిస్తున్నారు ఈ యంగ్ సెన్సేషన్.