
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ 200 కోట్ల షేర్ దిశగా వెళ్తుంది పుష్ప 2. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ మినహా.. మరే సినిమా ఏపీ, తెలంగాణలో కలిపి 200 కోట్ల షేర్ దాటలేదు.

ఎవరూ ఊహించని విధంగా వసూళ్ల సునామీ కురిపిస్తుంది పుష్ప 2. ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారంతా. కానీ మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డ్స్ తిరగరాస్తుందని మాత్రం అల్లు అర్జున్ అండ్ టీం కూడా ఊహించి ఉండరేమో..? తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది పుష్ప 2. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.

డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2.. మొదటి రోజు నుంచే ప్రభంజనం సృష్టిస్తుంది. తొలిరోజు ఏకంగా 294 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజుకు 449 కోట్లు.. మూడు రోజుల్లో 621 కోట్లు.. 4 రోజుల్లో 829 కోట్లు.. 5 రోజుల్లోనే 922 కోట్లు వసూలు చేసింది. 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్బులో చేరిపోయింది పుష్ప 2. అప్పట్లో బాహుబలి 2.. 10 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్బులో చేరింది.

బాహుబలి 2 పేరు మీదున్న 10 రోజుల రికార్డును 6 రోజులకు తగ్గించాడు పుష్ప రాజ్. ఇక 1000 కోట్ల మార్క్ అందుకోడానికి ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2, కల్కి 2898 ఏడి సినిమాలకు 16 రోజులు పట్టింది. షారుక్ ఖాన్ జవాన్‌కు 18 రోజులు, పఠాన్ సినిమాకు 27 రోజులు పట్టింది. ఏదేమైనా పుష్ప 2 రికార్డ్ ఇప్పట్లో బద్ధలవ్వడమైతే కష్టమే.

6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్బులో పుష్ప 2.. తొలిరోజు ఏకంగా 294 కోట్లు వసూళ్ళు.. రెండో రోజుకు 449 కోట్లు.. మూడు రోజుల్లో 621 కోట్లు.. అలా 16 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసిన కేజియఫ్ 2, RRR, కల్కి షారుక్ ఖాన్ జవాన్‌కు 18 రోజులు, పఠాన్ సినిమాకు 27 రోజులు