అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్.. థియేటర్లలో విడుదల కానున్న పొలిమేర 2
అభిమానులకు ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. పుష్ప2 సెట్‌లో తీసిన వీడియో పంచుకున్నారు. పుష్ప2 తన కెరీర్‌లో 20వ సినిమా అని అన్నారు. ఫ్యాన్స్ చూపించిన అభిమానం,తనను సరిహద్దులు దాటేలా చేసిందని తెలిపారు. తనకు పుష్ప మూవీలో పుష్పరాజ్ కేరక్టరైజేషన్ అంటే ఇష్టమని అన్నారు. దేనికీ వెనకడుగు వేయని పుష్పరాజ్ నైజం గొప్పదన్నారు బన్నీ. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి 2898AD. ఈ సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి డైరక్షన్ డిపార్ట్ మెంట్‌కి కూడా ఆయన సలహాలు ఇస్తున్నారని టాక్. తన సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు రాజమౌళి. అయితే, ప్రభాస్ కల్కిలో పార్ట్ కావడం సూపర్ అంటున్నారు నెటిజన్లు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 01, 2023 | 1:19 PM

Pushpa 2: అభిమానులకు ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. పుష్ప2 సెట్‌లో తీసిన వీడియో పంచుకున్నారు. పుష్ప2 తన కెరీర్‌లో 20వ సినిమా అని అన్నారు. ఫ్యాన్స్ చూపించిన అభిమానం,తనను సరిహద్దులు దాటేలా చేసిందని తెలిపారు. తనకు పుష్ప మూవీలో పుష్పరాజ్ కేరక్టరైజేషన్ అంటే ఇష్టమని అన్నారు. దేనికీ వెనకడుగు వేయని పుష్పరాజ్ నైజం గొప్పదన్నారు బన్నీ.

Kalki: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి 2898AD. ఈ సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి డైరక్షన్ డిపార్ట్ మెంట్‌కి కూడా ఆయన సలహాలు ఇస్తున్నారని టాక్. తన సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు రాజమౌళి. అయితే, ప్రభాస్ కల్కిలో పార్ట్ కావడం సూపర్ అంటున్నారు నెటిజన్లు.

Skanda: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ సినిమా నుంచి డుమ్మారే డుమ్మా పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 15న విడుదల కానుంది స్కంద. బోయపాటి శ్రీను డైరక్షన్ చేశారు. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది మూవీ. తమన్ సంగీతం అందించారు

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు హీరో షారుఖ్. జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం చెన్నైలో జరుగుతోంది. ఇంతకు మునుపు పఠాన్ సినిమా విడుదల సమయంలోనూ వైష్ణోమాత ఆలయాన్ని సందర్శించారు షారుఖ్.

Maa Oori Polimera 2: సత్యం రాజేష్ కీలక పాత్రలో నటించిన సినిమా మా ఊరి పొలిమేర. ఓటీటీలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న పొలిమేరకు సీక్వెల్ ఇది. ఈ సారి నేరుగా థియేటర్లలోనే విడుదల కానుంది. నవంబర్ 2న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.





























