
పుష్ప 2 టీం అంతా వైజాగ్ నుంచి అప్పుడే హైదరాబాద్‌కు వచ్చేసారు. పోర్ట్ ఏరియాలో షెడ్యూల్.. అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలు.. పెద్ద షెడ్యూల్ అంటూ చాలా వార్తలే వచ్చాయి. మరి వైజాగ్ నుంచి సడన్‌గా రావడానికి రీజన్ ఏంటి..? అక్కడ షెడ్యూల్ అయిపోయిందా లేదంటే ఇక్కడేమైనా కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసారా..? అసలేం జరుగుతుంది..?

మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించే పుష్ప 2 ఉంటుందంటూ ప్రతీ వేడుకలో చెప్తున్నారు సుకుమార్. సాధారణంగా తన సినిమాలపై అంత హైప్ ఇవ్వరు లెక్కల మాస్టారు. కానీ పుష్ప 2పై మాత్రం ఈయన నమ్మకం మామూలుగా లేదు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

మూడు రోజుల కిందే వైజాగ్‌కు వెళ్లిన పుష్ప టీం.. అప్పుడే సిటీకి వచ్చేసారు. గతవారమే వైజాగ్ పోర్టులో కొన్ని కీ సీన్స్ చిత్రీకరించారు సుకుమార్. కేవలం రెండు రోజుల షూట్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చేయడంతో.. ఏదైనా తేడా జరిగిందేమో అనే గాసిప్స్ మొదలయ్యాయి.

కానీ అసలు కథ అది కాదు. వైజాగ్‌లో ముందు నుంచి ప్లాన్ చేసింది రెండ్రోజుల షూటే. ఇప్పుడు హైదరాబాద్‌లోని తాహిర్ స్టూడియోలో పుష్ప 2 షూట్ జరుగుతుంది. చాలా రోజులుగా పుష్ప 2 మేజర్ షెడ్యూల్స్ అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి.

మధ్య మధ్యలో వైజాగ్‌తో పాటు మారేడుమిల్లి అడవులకు వెళ్లొచ్చారు టీం. త్వరలోనే విశాఖలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు పుష్ప మేకర్స్. ఆగస్ట్ 15న అనుకున్నట్లుగానే సినిమా విడుదల కానుంది. మొత్తానికి కొన్నాళ్లుగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా షూటింగ్‌లో పుష్ప దూసుకుపోతున్నాడు.