Pushpa 2: వస్తున్నాం.. కొడుతున్నాం.! ఇక డౌట్ పడకండి.. పుష్ప టీం క్లారిటీ.!
అనుమానాలు అక్కర్లేదమ్మా.. కచ్చితంగా వస్తున్నాం కొడుతున్నాం..! ఇక డౌట్ పడకండి.. చెప్పిన టైమ్‌కు చెప్పిన తేదీకి రావడమే తరువాయి.! ఇంతకీ ఎవరి గురించి ఈ ఇంట్రో అంతా అనుకుంటున్నారు కదా.? ఇంకెవరు.. మన పుష్ప రాజ్ గురించే ఈ చర్చంతా. మరోసారి ఈయన రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు. నమ్మట్లేదని కౌంట్ డౌన్ మొదలుపెట్టారు కూడా. మీరు ఎంతైనా ఊహించుకోండి. దాన్ని మించే పుష్ప 2 ఉంటుందంటూ ప్రతీ వేడుకలో చెప్తున్నారు సుకుమార్.