
ఎప్పుడూ కామెడీ సినిమాలే ఏం చేస్తాం.. అప్పుడప్పుడూ కొత్తగా ట్రై చేస్తేనే కదా మనలో ఉన్న నటుడికి కూడా పని చెప్పినట్లు ఉంటుంది అంటున్నారు అల్లరి నరేష్. నాంది నుంచి ఆయన చేస్తున్నది ఇదే. మధ్య మధ్యలో కామెడీ ట్రై చేస్తున్నా.. ఈ మధ్య ఎక్కువగా విభిన్నమైన కాన్సెప్ట్స్ వైపు అడుగులేస్తున్నారు నరేష్.

నాందీ తర్వాత పూర్తిగా మారిపోయారు అల్లరి నరేష్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్తగానే ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోనే ప్రస్తుతం ఆల్కహాల్, 12ఏ రైల్వే కాలనీ సినిమాలు వస్తున్నాయి.

ఇందులో ఆల్కహాల్‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా టీజర్ కట్ చేసారు దర్శకుడు మెహర్ తేజ్. గతంలో సుహాస్‌తో ఫ్యామిలీ డ్రామా అనే సినిమా చేసారీయన.

ఒకప్పట్లా వరసగా సినిమాలు చేయట్లేదు నరేష్.. కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారు. చేసేవి తక్కువ సినిమాలైనా కచ్చితంగా ఇంపాక్ట్ ఉండేలా చూసుకుంటున్నారు.

ఆల్కహాల్ కచ్చితంగా తన కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందని బాగా నమ్ముతున్నారీయన.. అలాగే పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ అందిస్తున్న 12ఏ రైల్వే కాలనీపైనా బాగానే ఆశలు పెట్టుకున్నాడు అల్లరోడు.