- Telugu News Photo Gallery Cinema photos Alekhya Harika Graceful looks in blue saree goes viral in internet
Alekhya Harika: తారలనే చీరగా మలచి ఈ కోమలికి బహూకరించాడు ఆ చంద్రుడు.. గ్రెస్ఫుల్ హారిక..
అలేఖ్య హారిక.. దేత్తడి హారికగా యూట్యూబ్ స్టార్‌గా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. యూట్యూబ్ లో అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది ఈ భామ.
Updated on: Jun 14, 2025 | 4:07 PM

9 సెప్టెంబర్ 1997న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార అలేఖ్య హారిక. ఈ బ్యూటీకి వంశీ కార్తీక్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు. దేత్తడి హారికగా యూట్యూబ్ వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ

హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో స్కూలింగ్ విద్య పూర్తిచేసింది. మెహదీపట్నంలో ఉన్నసెయింట్ ఆన్స్ కళాశాల నుంచి బ్యాచలర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ. అలేఖ్యకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్ కావాలని కోరిక.

2015లో ఆమె హైదరాబాద్‌లోని అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. అలేఖ్య దాదాపు మూడు సంవత్సరాలు అక్కడ పని చేసింది. తర్వాత యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది.

ఈ పాపులారిటీతో దేత్తడి హారిక స్టార్ మా ప్రసారం అయినా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయింది ఈ వయ్యారి భామ. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

తర్వాత తెలుగులో ఆదిత్య వర్మ, వరుడు కావలెను, శ్రీకారం, సింబా అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. ఓ సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది. సంగీత్ శోభన్ సరసన తొలిసారి హీరోయిన్గా చేస్తుంది ఈ బ్యూటీ.




