
తన కన్నా చిన్న వయసు వ్యక్తితో ప్రేమలో పడే యువతిగా నయనతార ఓ సినిమా చేస్తున్నారు. కొత్త డైరక్టర్ డీల్ చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే ఇలాంటి థీమ్‌తో వచ్చిన వచ్చి క్లిక్ అయిన సినిమాలను ఓ సారి గుర్తుచేసుకుంటున్నారు జనాలు. సమంత టు శ్రుతిహాసన్... ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్టులతో క్లిక్ అయ్యారని మాట్లాడుకుంటున్నారు.

సమంతకు బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏ మాయ చేసావె. ఇందులో హీరోయిన్... హీరోకన్నా వయసులో పెద్దమ్మాయి. ఈ కాన్సెప్ట్ కి, థీమ్‌కి ఇప్పటికీ ఫిదా అవుతుంటారు ఆడియన్స్.

నాగచైతన్య నటించిన ఇంకో సినిమా ప్రేమమ్‌లోనూ ఇలాంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. తనకు చదువు చెప్పించే లేడీతో ప్రేమలో పడతాడు హీరో. ప్రేమమ్ తెలుగు వెర్షన్‌లో శ్రుతి,మలయాళ వెర్షన్‌లో సాయిపల్లవి ఈ రోల్‌లో నటించారు.

మలయాళంలోనూ, తెలుగులోనూ సక్సెస్ అయిన ప్రేమమ్ సినిమాలోనే కాదు... మలయాళ - తెలుగు నేటివిటీలను కలిపి తీసిన ప్రేమలు సినిమాలోనూ ఈ ఏజ్ ఫ్యాక్టర్ కాసులు కురిపించింది. ప్రేమలు సినిమాలోనూ హీరో కన్నా హీరోయిన్ వయసులో పెద్దదే.

అనుష్క శెట్టి కెరీర్‌లో రీసెంట్ హిట్ మూవీ మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. తనకన్నా చిన్న వ్యక్తి ద్వారా గర్భం దాల్చిన స్త్రీగా నటించి మెప్పించారు అనుష్క. లేడీ లక్ అంటూ నవీన్ పొలిశెట్టి తన యాక్టింగ్‌తో కాసులు కురిపించారు.