రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
వైట్ సారీలో, అందమైన బంగ్లాలో అర్థ రాత్రి చీకటిలో ఓ క్రేజీ బ్యూటీ రక్తం తాగే పిశాచిలా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆ నటి ఎవరు? ఎందుకు అలా మారిపోయిందో తెలుసుకుందాం పదండి మరి.
Updated on: Jul 15, 2025 | 1:00 PM

ఒక ప్పుడు వరస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకోవడమే కాకుండా కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ చిన్నది బాలీవుడ్, కోలీవుడ్ చక్కేసింది. అక్కడ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తెల్ల చీరలో చిరు దీపంతో దర్శనం ఇచ్చి అందరికీ షాకిచ్చింది.

ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఆదాశర్మ.. అందాల ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి ఎంత చెప్పినా తక్కవే, ఈ అమ్మడు నితిన్ సరసన హార్ట్ ఎటాక్ అనే మూవీలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను వదిలేసి, కోలీవుడ్, బాలీవుడ్ చక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్, యాక్షన్స్ సీన్స్‌లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.మరీ ముఖ్యంగా దికేరళ స్టోరీస్ మూవీతో ఈ అమ్మడు మరోసారి సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఈ సినిమాకు గాను ఈ చిన్నది ఎన్నో అవార్డ్సు సొంతం చేసుకుంది.

ఇక తాజాగా ఈ అమ్మడు డెవిల్ పాత్రలో నటించడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే పెద్ద బంగ్లాలో, తెల్ల చీరలో దీపం వెలుతురులో ఉన్న ఫొటోలను ఈ బ్యూటీ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడును చూడటానికి రెండు కళ్లు చాలావు అంత అందంగా ఉంది.

మరో వైపు దెయ్యం గెటప్‌లో చూస్తే వణికిపోయే విధంగా ఉన్న ఫొటోస్‌ను షేర్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో ఆదాను చూస్తే ఎవ్వరైనా సరే భయపడాల్సిందే. అలా ఉన్నాయి ఫొటోస్, ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



