
2010లో ఝుమ్మంది నాథం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు.. ఆతర్వాత ధనుష్ సరసన ఆడుకలం సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది.

తెలుగులో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రభాస్ జోడిగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మెరిసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిప్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ సైతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది.

చివరగా షారుఖ్ సరసన డుంకీ చిత్రంతో హిట్టుకొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. 11 సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత తాప్సీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయిస్‌ను కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది.

వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయపూర్ లో జరిగింది. ప్రస్తుతం తాప్సీ ములాక్ 2, గాంధారి చిత్రాల్లో నటిస్తుంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు నెట్టింట ఓ వైపు పద్దతిగా ఆకట్టుకుంటూనే మరో వైపు మోడ్రన్ డ్రస్సుల్లో మెరుస్తూ కవ్విస్తుంది. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.