Rajeev Rayala |
Updated on: Dec 18, 2021 | 10:12 AM
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది అందాల భామ స్నేహ ఉల్లాల్
ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి అనుకున్న స్థాయి హిట్ పడలేదు.
బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో హీరోయిన్ గా చేసినప్పటికీ స్నేహాఉల్లాల్ కు గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం సినిమాలు తగ్గించింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నేడు ఈ అమ్మడు పుట్టిన రోజు.. స్నేహ ఉల్లాల్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.