
సమంత కొత్త ప్రాజెక్టులకు సంతకం చేసి చాన్నాళ్లే అయింది. త్వరలో పెళ్లి చేసుకుంటే కీర్తీ సురేష్ నెక్స్ట్ సినిమాలు చేస్తారో లేదో తెలియదు. ఇక వీళ్ల నుంచి సినిమాలు ఉంటాయా? ఉండవా? అనే అనుమానాలేం అక్కర్లేదని అంటున్నారు తమిళ తంబిలు.

టాలీవుడ్ సామ్, కోలీవుడ్ కీర్తీ ఇద్దరూ కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టుకు త్వరలోనే సైన్ చేస్తారన్నది ఇంట్రస్టింగ్ న్యూస్. ఫ్యామిలీమేన్2 హిట్ సీరీస్ చేసిన డైరక్టర్స్ రాజ్ అండ్ డీకే. వీరిద్దరితో కలిసి సిటాడెల్ చేస్తున్నారు సమంత.

ఈ ప్రాజెక్టు తర్వాత ఆమె ఇంకెవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తనదైన స్పేస్‌లో పాడ్‌కాస్ట్ లు, ఫొటో షూట్‌లు చేసుకుంటూ సందడిగా ఉన్నారు. అయితే సామ్ అతి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేయబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది.

విజయ్ 69వ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తారన్నది టాక్. హెచ్.వినోద్ డైరక్ట్ చేస్తారని, సామ్‌కి ఆల్రెడీ సిగ్నల్స్ అందాయన్నది కోడంబాక్కం న్యూస్.

ఈ సినిమా కోసం కియారాను కూడా అనుకుంటున్నారు. కియారా వర్సెస్ కీర్తీసురేష్ అంటూ సాగే పోటీలో ఎవరు గెలుస్తారనేది ఇంట్రస్టింగ్ విషయం.

ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా ఉంది. అయితే ఒకవేళ మధ్యలో పెళ్లి చేసుకున్నా సరే, దళపతి మూవీలో ఆమె నటిస్తారన్న విషయం తమిళనాడులో స్ప్రెడ్ అవుతోంది.

బాగా పరిచయం ఉన్నవారికి వెంటపెట్టుకుని వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఆమె ప్రస్తుతం నార్త్ లో బేబీ జాన్‌లో నటిస్తున్నారు. తెరికి రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. నార్త్ మేకర్స్ తో కలిసి అట్లీ దంపతులు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్ 25న బేబీ జాన్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో అనే టెన్షన్ కనిపిస్తోంది కీర్తీ సురేష్‌లో.