- Telugu News Photo Gallery Cinema photos Actress saanve megghana shared her latest stunning photos goes viral
Saanve Megghana: సాన్వే మేఘన మెరుపులు.. కుర్రాళ్లకు పడుతున్నాయి చమట్లు
సాన్వే మేఘన ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో నటిస్తుంది. ఆమె తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, యువ నటిగా మంచి గుర్తింపు పొందింది. తన నటనతోపాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. సాన్వే మేఘన 1998 సెప్టెంబరు 12న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మందుముల వంశీ కిషోర్ మరియు పద్మ. ఆమె తన విద్యాభ్యాసాన్ని బాల్డ్విన్ గర్ల్స్ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు పూర్తి చేసి, ఆ తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి డిగ్రీ సాధించింది.
Updated on: Apr 16, 2025 | 8:30 PM

సాన్వే మేఘన ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో నటిస్తుంది. ఆమె తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, యువ నటిగా మంచి గుర్తింపు పొందింది. తన నటనతోపాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

సాన్వే మేఘన 1998 సెప్టెంబరు 12న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మందుముల వంశీ కిషోర్ మరియు పద్మ. ఆమె తన విద్యాభ్యాసాన్ని బాల్డ్విన్ గర్ల్స్ హైస్కూల్‌లో పదవ తరగతి వరకు పూర్తి చేసి, ఆ తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి డిగ్రీ సాధించింది.

విద్యార్థిగా ఉన్న సమయంలో క్యాంపస్‌లో జరిగే సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం ద్వారా నటనపై ఆసక్తి పెంచుకుంది. ఒక సీరియల్ ఆడిషన్ ద్వారా ఆమె నటనా రంగంలోకి ప్రవేశించింది. సాన్వే మేఘన తన సినీ ప్రస్థానాన్ని 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రారంభించింది.

ఈ చిత్రం ఆమెకు సినిమా రంగంలో మొదటి అడుగుగా నిలిచింది. ఆ తర్వాత ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సైరా నరసింహారెడ్డి, పిట్ట కథలు, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, పుష్పక విమానం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇటీవల తమిళ్ లోనూ ఓ సినిమా చేసి పేక్షకులను మెప్పించింది. ఈ చిన్నది.





























