Tollywood: ఓర చూపుల చిన్నది.. కవ్వించే వయ్యారి.. పూజిత మైండ్ బ్లోయింగ్ ఫోజులు..
అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో కట్టిపడేసింది. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఈ అమ్మాయి సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ లో కొన్నాళ్లపాటు విధులు నిర్వహించింది. ఆ తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
Updated on: Feb 05, 2025 | 3:31 PM

పూజిత పొన్నాడ.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. 2016లో నాగార్జున ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. కానీ ఈ సినిమాలు ఏవి పూజితకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

ఆ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాతో పూజితకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. ఇందులో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో కనిపించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది.

ఆ తర్వాత తెలుగులో రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంటికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అలాగే రవితేజ నటించిన రావణాసుర సినిమాలో కీలకపాత్రలో పోషించింది. అయితే ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ మాత్రం రాలేదు. రంగస్థలం రేంజ్ లో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఆఫర్స్ వస్తున్నప్పటికీ సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తుంది.

ఇదిలా ఉంటే.. పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.





























