టాలీవుడ్ లో బుట్టబొమ్మగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పూజ హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజ. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిన్నది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్,ప్ ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజాహెగ్డే వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. దాంతో ఈ అమ్మడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.