AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Health: పిల్లలకు ఇలాంటి ఆహారాలు అస్సలు ఇవ్వకూడదు.. చిన్నతనంలోనే లివర్‌ మటాష్‌

వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే వేసవిలో వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీవ్రమైన వేడిలో పిల్లలకు ఆహారం సులభంగా జీర్ణం కాదు. తినడం, త్రాగడం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు కడుపు సమస్యలతో బాధపడుతారు. వేసవిలో పిల్లలకు కొన్ని ఆహారాలు అస్సలు ఇవ్వకూడదు..

Srilakshmi C
|

Updated on: Jun 03, 2024 | 8:52 PM

Share
వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే వేసవిలో వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీవ్రమైన వేడిలో పిల్లలకు ఆహారం సులభంగా జీర్ణం కాదు. తినడం, త్రాగడం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు కడుపు సమస్యలతో బాధపడుతారు. వేసవిలో పిల్లలకు కొన్ని ఆహారాలు అస్సలు ఇవ్వకూడదు.

1 / 5
పిల్లలకు గ్రిల్ చేసిన ఆహారం అస్సలు ఇవ్వకూడదు. వీటివల్ల చిన్న వయస్సులోనే పిల్లల అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. వేయించిన ఆహారం నేరుగా పిల్లల కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం, విరేచనాలు, రక్త విరేచనాలు వంటి ప్రధాన సమస్యలకు దారి తీస్తుంది.

2 / 5
వేసవిలో పిల్లలకు స్వీట్లు ఎక్కువగా ఇవ్వకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా శిశువుకు బాల్యంలోనే మధుమేహం బారీనపడే అవకాశం ఉంది. అలాగే ఉప్పును పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఆహారంలో వీలైనంత తక్కువ ఉప్పు కలపాలి. ఎక్కువ ఉప్పు రక్తంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. ఇది అధిక రక్తపోటుకు కూడా దారితీస్తుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకం కావచ్చు.

3 / 5
పిల్లలకు పిండి పదార్ధాలు ఎక్కువగా ఇవ్వకూడదు. ఇవి పిల్లలకు త్వరగా జీర్ణం కావు. పింది పదార్ధాలు కాలేయానికి కూడా హానికరం. కాబట్టి పిండికి బదులుగా పిల్లలకు బ్రెడ్‌, పండ్లు, కూరగాయల సూప్‌లను తినిపించడం మంచిది.

4 / 5
వేడి వాతావరణంలో శీతల పానీయాలు ఉపశమనం కలిగిస్తాయి. కానీ ఆరోగ్యానికి ఇవి మంచిది కాదు. చల్లటి పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల జలుబు, దగ్గు వస్తుంది. అయితే శీతల పానీయాలు, ప్యాక్ చేసిన శీతల పానీయాలు పిల్లల కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు టీ లేదా కాఫీ తాగినప్పుడు పిల్లలకు కూడా ఇస్తుంటారు. కానీ టీ, కాఫీ పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా వేసవిలో వీటిని అస్సలు ఇవ్వకూడదు.

5 / 5