
చియా గింజలు పోషకాలు: 2 టేబుల్ స్పూన్ల చియా గింజల్లో మనకు 138 గ్రాముల క్యాలరీలు, 5 గ్రాముల ప్రోటిన్, 9 గ్రాముల కోవ్వు, 1 గ్రాము సాచురేటెడ్ కొవ్వు, 12 గ్రాము కార్బోహైడ్రేట్లు, 10 గ్రాములు ఫైర్, 5 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. కేవలం రెండు చెంచాల చియా గింజల నుండే మన శరీరానికి రోజువారీ అవసరమయ్యే పైబర్‌లో 36 శాతం లభిస్తుంది. ఇది జీర్ణక్రియలో ఒక జెల్ లాగా మారి, కొలెస్ట్రాల్‌ను శరీరం గ్రహించకుండా మలం ద్వారా బయటకు పంపేయడానికి సహాయపడుతుంది.

ఇక చేపలు తినని వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇందులో ఒమేగా -3 అమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో ఇది ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు ఒక చెంచా చియా గింజలు తింటే శరీరానికి కావలసిన ఒమేగా-3 అమ్లాలు అందుతాయి. వీటిని మనం నేరుగా స్మూతీలు, ఓట్స్ లేదా నీళ్లలో నానబెట్టుకుని సులభంగా తినవచ్చు.

అవిసె గింజలు: 2 టేబుల్ స్పూన్ల పొడి చేసిన అవిసె గింజల్లో 154 క్యాలరీలు, 5 గ్రాములు ప్రోటీన్, 11 గ్రాములు కోవ్వు, 1 గ్రాము సాచురేటెడ్ కొవ్వు, 10 గ్రాములు కార్బోహైడ్రేట్లు , 7 గ్రాములు ఫైబర్,11 మిల్లీగ్రాములు సోడియం ఉంటుంది. ఇవన్నీ మన శరీరానికి ఎన్నో విదాలుగా మేలు చేస్తాయి. చియా గింజలతో పోలిస్తే అవిసె గింజల్లో లిగ్నాన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, శరీరంలో వాపులను తగ్గించడానికి నేరుగా సహాయపడతాయి.

కొలెస్ట్రాల్ నియంత్రణ: గుండె జబ్బుల రిస్క్ తగ్గించడానికి, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయని 2024 లో జరిగిన ఒక పెద్ద పరిశోధనలో తేలింది. అయితే అవిసె గింజలను ఎప్పుడూ పొడి చేసుకుని మాత్రమే తినాలి. అప్పుడే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే ఈ పొడిని ఫ్రిజ్‌లో ఉంచి కొన్ని నెలల్లోనే వాడేయాలి.

గుండె ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఏది బెటర్?: డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే మీరు సులభంగా వాడాలనుకుంటే చియా గింజలు బెటర్ ఆప్షన్ అవుతాయి. ఎందుకంటే వీటిని పొడి చేయాల్సిన అవసరం లేదు నేరుగా మీరు తినే మిగతా ఆహారాంలో చేర్చుకోవచ్చు. ఒక వేళ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడమే మీ లక్ష్యం అయితే అవిసె గింజలు బెటర్. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు ప్రతిరోజూ ఏది తినగలిగితే అదే మీకు బెస్ట్ ఛాయిస్. వీలైతే మీ డైట్‌లో ఈ రెండింటినీ మార్చి మార్చి వాడుకోవడం ఇంకా మంచిది.