AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏళ్ళ తరబడి వేధిస్తున్న మోకాళ్ళ నొప్పులను 10 నిమిషాల్లో ఈ ఆకుతో తరిమికొట్టండి

ప్రస్తుత జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో మోకాళ్ళ నొప్పులు చాలా మందిని పీడిస్తున్నాయి. మందులు, చికిత్సలతో పాటు ఇంటి చిట్కాలు, ఆయుర్వేద పద్ధతులు కూడా ఉపశమనం కలిగిస్తాయి. మన చుట్టూ ఉండే ఈ మొక్క, మోకాళ్ళ నొప్పులకు ఒక అద్భుతమైన పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Oct 31, 2026 | 2:50 PM

Share

ప్రస్తుత జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో మోకాళ్ళ నొప్పులు చాలా మందిని పీడిస్తున్నాయి. మందులు, చికిత్సలతో పాటు ఇంటి చిట్కాలు, ఆయుర్వేద పద్ధతులు కూడా ఉపశమనం కలిగిస్తాయి. మన చుట్టూ ఉండే జిల్లేడు మొక్క, మోకాళ్ళ నొప్పులకు ఒక అద్భుతమైన పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క, అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. సాధారణంగా పిచ్చి మొక్కగా భావించినప్పటికీ, జిల్లేడులోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఎర్ర జిల్లేడు, తెల్ల జిల్లేడు అని రెండు రకాలు ఉంటాయి. జిల్లేడు పాలు విషపూరితమైనవి అయినప్పటికీ, సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

1 / 5
మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఈ సులభమైన చిట్కాను ట్రై చేయవచ్చు. కొంచెం పెద్దవిగా ఉండే రెండు జిల్లేడు ఆకులను తీసుకోండి.  ఆకు మొత్తానికి ఆవాల నూనెను బాగా రాయండి. ఆవాల నూనె నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మందపాటి కడాయి లేదా పాత పెనాన్ని వేడి చేసి, ఆవాల నూనె రాసిన ఆకులను దానిపై ఉంచి వేడి చేయండి. ఆకులు కేవలం వేడెక్కితే చాలు, మరీ ఎండిపోకుండా చూసుకోండి.

2 / 5

వేడెక్కిన ఈ ఆకులను గోరువెచ్చగా ఉన్నప్పుడే మోకాళ్ళ చుట్టూ ఉంచి, ఒక గుడ్డతో గట్టిగా చుట్టండి. రాత్రంతా ఉంచుకోగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. లేదంటే కనీసం రెండు నుండి మూడు గంటల పాటు ఉంచుకోవాలి. ప్రతిరోజూ రాత్రిపూట ఇలా చేయడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.మోకాళ్ళ నొప్పుల చికిత్సలో ఆవాల నూనె కీలకమైనది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, వేడిచేసే లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆవాల నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు నొప్పిని, వాపును తగ్గించి, కండరాల నొప్పుల నుండి కూడా ఉపశమనం అందిస్తాయి.

3 / 5
జిల్లేడు మొక్క కేవలం మోకాళ్ళ నొప్పులకే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. జిల్లేడు పాలను నీటికి సమానంగా కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి. ఆకులను మెత్తగా రుబ్బి తీసిన రసాన్ని వాపులపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఆకుల పేస్ట్‌ను నుదుటిపై వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

4 / 5
పైల్స్‌తో బాధపడేవారికి ఈ చెట్టు చాలా బాగా సహాయపడుతుంది. లేత జిల్లేడు చిగుళ్ళను తాటిబెల్లంతో కలిపి మాత్రలుగా చేసుకొని తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం, విరోచనాలు, పేగుల్లో పుండ్లు తగ్గడానికి కూడా జిల్లేడును వాడతారు.
నరాల బలహీనత, ఆస్తమా, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

పైల్స్‌తో బాధపడేవారికి ఈ చెట్టు చాలా బాగా సహాయపడుతుంది. లేత జిల్లేడు చిగుళ్ళను తాటిబెల్లంతో కలిపి మాత్రలుగా చేసుకొని తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం, విరోచనాలు, పేగుల్లో పుండ్లు తగ్గడానికి కూడా జిల్లేడును వాడతారు. నరాల బలహీనత, ఆస్తమా, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

5 / 5
Follow Us