- Telugu News Photo Gallery Business photos Top Selling Cars WagonR sets sales record Now Maruti's No. 1 car
Top Selling Car: మారుతిలో నంబర్ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!
Top Selling Car: జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో..
Updated on: Feb 11, 2025 | 12:58 PM

మీరు మారుతి సుజుకి కార్ల అభిమాని అయితే లేదా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కారును తీసుకోవచ్చు. నివేదికల ప్రకారం.. జనవరి 2025లో మారుతి సుజుకి మొత్తం 1,73,599 కార్లను విక్రయించింది. గత ఏడాది జనవరి 2024 కంటే ఇది 4 శాతం పెరుగుదల. అనేక ప్రసిద్ధ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. జనవరి 2025 అమ్మకాల నివేదిక, కస్టమర్లు ఏ కార్లను ఎక్కువగా ఇష్టపడ్డారో తెలుసుకుందాం.

జనవరి 2025లో మారుతి కంపెనీ అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు: మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ 24,078 యూనిట్ల రికార్డు అమ్మకాలతో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది సంవత్సరానికి ఒక శాతం పెరుగుదల. ఇది 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు అద్భుతమైన మైలేజ్, CNG ఎంపిక కారణంగా గత జనవరిలో ఇది వినియోగదారుల మొదటి ఆప్షన్. 19,965 మంది కస్టమర్లు కొనుగోలు చేసిన బాలెనో రెండవ స్థానంలో ఉంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాలెనో నంబర్ 1 స్థానంలో ఉంది.

జనవరిలో మారుతి సుజుకి స్విఫ్ట్ 17,081 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.1% పెరుగుదల. 11 శాతం వృద్ధి నమోదైంది. స్పోర్టీ డిజైన్, అధిక పనితీరుతో ప్రజలు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ఇష్టపడుతున్నారు. మారుతి నాల్గవ బెస్ట్ సెల్లింగ్ కారు గ్రాండ్ విటారా. దీనిని గత నెలలో 15,748 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. సంవత్సరానికి 17 శాతం వృద్ధిని నమోదు చేశారు. 5వ స్థానంలో డిజైర్ సెడాన్ ఉంది. దీనిని 15,383 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు.

ఈ మారుతి కార్ల అమ్మకాలు తగ్గాయి: జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.1% పెరుగుదల. 8 శాతం తగ్గుదల ఉంది. గత నెలలో బ్రెజ్జా SUV అమ్మకాలు 4% తగ్గాయి. 14,747 మంది వినియోగదారులు దీనిని కొనుగోలు చేశారు.

ఎర్టిగా MPV అమ్మకాలు 3% తగ్గి 14,248కి చేరుకున్నాయి. XL6 అమ్మకాలు ఒక శాతం తగ్గి 4,403 యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో 11,250 యూనిట్ల ఈకో వ్యాన్ అమ్మకాలు జరిగాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% పెరుగుదల. 6 శాతం తగ్గుదల ఉంది. గత జనవరిలో జిమ్నీ కేవలం 163 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.




