- Telugu News Photo Gallery Business photos Indian Railways: This Train With Number 13228 has world Record Of 72 Hours Late
Indian Railways: యువర్ అటెన్షన్ ప్లీజ్.! రైలు నెంబర్ 13228 ఎంత లేటు వచ్చిందో తెల్సా
నీవెక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నారో సినీకవి. నిత్యం లక్షలాదిమందితో వేలాది గమ్యస్థానాల మధ్య ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్ధం చేసుకోదగినదే. కానీ మరీ 72 గంటల లేటైతే.? ఇండియన్ రైల్వే అనధికారిక వివరాల ప్రకారం.. ఆ ట్రైన్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
Updated on: Feb 10, 2025 | 6:36 PM

భారతీయ రైల్వే ప్రతీ రోజూ దాదాపు 13 వేల రైళ్లను నడుపుతోంది. దేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800ను దాటగా.. రైల్వే లైన్ల పొడవు 1,26,366 కిలోమీటర్లగా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రైలు నెట్‌వర్క్ పొడవు 9,077.45 కి.మీగా నమోదైంది.

ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్.. మన ఇండియన్ రైల్వేస్. ప్రతీరోజూ లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు రైళ్లు చేరుస్తుంటాయి. దేశంలోని వేలాది గమ్యస్థాల మధ్య ప్రయాణించే ఈ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అర్ధం చేసుకోదగినదే.

అయితే అదే ఆలస్యంలో ఓ రైలు ప్రపంచ రికార్డు సృష్టిస్తే.. అవునండీ.! మీరు విన్నది నిజమే.. ఓ రైలు ఒకట్రెండు గంటలు కాదు.. పోనీ ఓ 5 గంటలు కూడా కాదు.. 72 గంటలు లేటైతే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

రైల్వే అనధికారిక వివరాల ప్రకారం.. 2017లో రాజస్థాన్‌లోని కోటా నుంచి పట్నా వెళ్లాల్సిన 13228 నెంబర్ రైలు.. అత్యంత ఆలస్యంగా నడిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. లేటు అంటే.. మాములుగా కాదు 72 గంటలు లేటుగా వచ్చింది.!

అయితే రైల్వే అధికారిక వివరాల ప్రకారం ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ పేరిట ఉంది. 2014 డిసెంబర్‌లో ఈ మహానంద ఎక్స్‌ప్రెస్ మొఘల్‌సరాయ్-పట్నా మధ్య 71 గంటలు ఆలస్యంగా నడిచింది.




