- Telugu News Photo Gallery Business photos Diwali Credit Card Offers: Avoid Debt Traps and Smart Shopping Tips
క్రెడిట్ కార్డ్.. ఈ 5 ట్రాప్స్‌లో పడకండి! దీపావళికి మీ డబ్బును సేఫ్‌గా ఉంచుకోండి!
దీపావళి పండుగ ఆఫర్ల పేరుతో బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు క్రెడిట్ కార్డ్ డీల్స్‌ను ప్రకటిస్తాయి. ఈ ఆఫర్లకు ఆశపడి, విపరీతంగా కొనుగోళ్లు చేస్తే, పండగ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోతారు. EMI ఉచ్చులు, దాచిన ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య రుసుములు, క్రెడిట్ స్కోర్‌కు నష్టం వంటి ఆర్థిక నష్టాలుంటాయి.
Updated on: Oct 13, 2025 | 6:56 PM

దీపావళి సందర్భంగా బ్యాంకింగ్ సంస్థలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ఆఫర్లను ప్రకటిస్తాయి. దీపావళికి చాలామందికి కొత్త వస్తువులు కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు, డీల్‌లను ప్రకటిస్తుంటాయి. ఆ ఆఫర్లకు ఆశపడి.. క్రెడిట్‌కార్డులతో ఎడాపెడా కొనుగోళ్లు చేస్తే.. పండగ తర్వాత అప్పుల కుప్ప పేరుకుపోతుంది.

EMI ఉచ్చు.. జీరో డౌన్ పేమెంట్ అంటూ EMI ఆఫర్లు ఉన్నా, తరచుగా ప్రాసెసింగ్ ఫీజులను హైడ్ చేస్తూ ఉంటారు. ఆఫర్ ఆకర్షణీయంగా కనిపించేలా ఉన్నా.. ధరలను పెంచిన తర్వాత ఆఫర్లు పెడతారు.

మీ క్రెడిట్ పరిమితిని మించిపోవడం.. పండుగ షాపింగ్ క్రెడిట్ వినియోగాన్ని పెంచుతుంది. మీ కార్డ్ పరిమితిలో 40 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండండి, ఎందుకంటే ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.

లేట్ పేమెంట్.. అధిక వడ్డీ.. క్రెడిట్ కార్డ్ లేదా లోన్ చెల్లింపు ఒక్కసారి తప్పినా అది ఖరీదైనదిగా మారుతుంది. బ్యాంకులు ఆలస్య రుసుములతో పాటు 30–45 శాతం వార్షిక వడ్డీని వసూలు చేయవచ్చు. అలాంటి డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ నివేదికలో ఏడు సంవత్సరాల వరకు ఉంటాయి.

దుర్వినియోగ నగదు ఉపసంహరణలు.. క్రెడిట్ కార్డులపై నగదు ఉపసంహరించుకుంటే ఉపసంహరణ రోజు నుండి తక్షణ వడ్డీ, 2–3 శాతం లావాదేవీ రుసుము ఉంటుంది.

ఫ్లాష్ డీల్స్‌కు బానిసవడం.. విక్రేతలు డిస్కౌంట్లను ప్రకటించే ముందు తరచుగా ధరలను పెంచుతారు. కొనుగోలు చేసే ముందు ఎల్లప్పుడూ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ధరలను క్రాస్-చెక్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక రుణం, ఉచిత డబ్బు కాదు.




