జీతం తక్కువే అని బాధపడకండి.. ఇలా చేస్తే బోలెడంత డబ్బు పొదుపు చేయవచ్చు!
రోజు రోజుకు నిత్యవసర ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మార్కెట్ కు వెళ్లి ఏ వస్తువు కొందాం అని చూసినా.. వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటు చూస్తే జీతాలు తక్కువ, అటు చూస్తే అన్ని వస్తువుల ధరలేమో ఎక్కువ. ఇలాంటి సమయంలో పొదుపు చేయడం అంటే చాలా కష్టమే. కానీ జీతం తక్కువగా ఉన్నా కానీ మనం పొదుపు చేయొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Feb 23, 2025 | 11:47 AM

చాలా మంది తమ జీతంలో ఖర్చులన్నీ పోను మిగిలిన డబ్బును పొదుపు చేయాలి అనుకుంటారు. కానీ అలా చేయకూడదంట. మీ సంపాదన 20 నుంచి 50 వేల మధ్య ఉంటే మీరు 50,20,30 ఫార్ములాను పాటించాలంట.

అంటే మీకు వచ్చే ఆదాయంలో 50 శాతం తప్పనిసరిగా ఖర్చు పెట్టడానికి వాడాలి, 30 శాతం ఇతర ఖర్చులు,20 శాతం సేవింగ్స్ ఖాతాకు మల్లించాలంట.

అయితే ప్రతి నెల తప్పనిసరిగా, అద్దె, ఈఎంఐ, కరెంట్, గ్యాస్ బిల్లు, స్కూల్ ఫీజు ఇలా చాలా వరకు తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. అందుకే వీటి కోసం తప్పకుండా మీ జీతంలో 50 శాతం పక్కన పెట్టేసుకోవాలి.

ఇంకా 50 శాతం జీతం అలాగే ఉంటుంది. అందులో,30 శాతం వరకు ఏదైనా ట్రిప్ కి వెళ్లడం, మొబైల్ రీచార్జ్, పెట్రోల్ డిజీల్, సినిమాలకు వెళ్లడం, ఇలాంటి వాటికి 30 శాతం జీతం పక్కన పెట్టేసుకోవాలి.

మిగిలిన 20 శాతం మాత్రం తప్పకుండా మీరు సేవింగ్ చేసుకోవాలంట. ఇలా చేయడం వలన భవిష్యత్తులో వచ్చే సమస్యలను మీరు ఈజీగా ఎదుర్కోగలరు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా చాలా మంది ఎలా పడితే అలా ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా మీ జీతంలో 20 శాతం సేవింగ్ చేసుకునే విధానంగానే మీరు ఖర్చులను ప్లాన్ చేసుకోవాలంట. ఎంత తక్కువ జీతం ఉన్నవారైనా సరే ఈ ఫార్ములాను పాటిస్తే బోలెడంత డబ్బును పొదుపు చేయొచ్చునంట.