చర్మానికి మేలు చేస్తుంది : లెమన్ గ్రాస్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మంతో బాధపడేవారు తమ చర్మ సంరక్షణలో నిమ్మ గడ్డిని చేర్చుకోవాలి. ఇది యాంటీ బాక్టీరియల్, సహజ ప్రక్షాళనగా పనిచేస్తుంది. ఈ నీళ్లతో ముఖం కడుక్కోవచ్చు లేదా గ్రైండ్ చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు.