
శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ 1993 మే 10 తెలంగాణలోని నిజమాబాద్ జిల్లాలో జన్మించింది. ఈ బ్యూటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

ఇక ఈ అమ్మడుకు సినిమాలు అంటే అమితమైన ఇష్టం. దీంతో పటాస్ కామెడీ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చీ, తన మాటతీరు, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత సూపర్ సింగర్ 9లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

యాంకరింగ్ లోనే కాకుండా పలు సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరి రాజీ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిచింది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత చాలా సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఓ వైపు సినిమాలు, మరో వైపు షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఇటీవల బిగ్ బాస్ అగ్నీ పరీక్షలో యాంకరింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లూ కలర్ పరికిణిలో తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.