3 / 5
ఆయిల్ పుల్లింగ్ థెరపీ – బ్యాక్టీరియాను తొలగించడానికి, నోటి పరిశుభ్రతను కాపాడటానికి ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక స్వదేశీ పద్ధతి. దీని ద్వారా మీ నోటి, నాసికా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది శ్లేష్మ పొరను హైడ్రేట్ చేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గించి కావిటీస్ రాకుండా తోడ్పడుతుంది. ఆయిల్ పుల్లింగ్ కోసం నోటిలో 1 టీస్పూన్ నువ్వు లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి. దీన్ని తాగవద్దు నోటిలో 2-3 నిమిషాలు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.