AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు విలవిల్లాడుతున్న జనం ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్, పండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చాలామంది పుచ్చకాయను అమితంగా ఇష్టపడతారు. శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించడంలో దీనికి సాటిలేదు. అయితే, పుచ్చకాయను సరైన పద్ధతిలో తినకపోతే ప్రయోజనం కంటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశమే ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ డాక్టర్ రితి పాండే సూచనల ప్రకారం.. పుచ్చకాయ తినేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన జీర్ణవ్యవస్థను ఎలా దెబ్బతీస్తాయో తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Apr 20, 2026 | 6:21 PM

Share
ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ: చాలామంది పుచ్చకాయను బయట నుంచి తెచ్చిన వెంటనే ముక్కలు కోసి, చల్లబడాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని సహజమైన పోషకాలు నశించి, దాని గుణాలు మారిపోతాయి. కోసిన పండుపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇది కడుపునొప్పికి దారితీస్తుంది. పుచ్చకాయను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచి తినాలి. ఒకవేళ మిగిలిపోతే గాలి చొరబడకుండా మూత పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలి.

1 / 5
తిన్న వెంటనే నీళ్లు తాగడం: పుచ్చకాయలో సహజంగానే దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో అజీర్ణం ఏర్పడుతుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణరసాలు పలచబడి, ఆహారం సరిగ్గా అరగదు. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి. పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీటికి దూరంగా ఉండటమే ఉత్తమం.

2 / 5
మోతాదు మించితే ముప్పే: ఏదైనా అతిగా తింటే అమృతం కూడా విషమే అవుతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని కిలోల కొద్దీ తినకూడదు. ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒక చిన్న గిన్నెడు ముక్కలు లేదా 2 నుండి 3 పెద్ద ముక్కలు తింటే సరిపోతుంది. ఒక మధ్యస్థ పరిమాణపు పుచ్చకాయ ఒక కుటుంబంలో నలుగురికి సరిపోతుంది. అంతకు మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు.

3 / 5
గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే నల్ల ఉప్పు:  పుచ్చకాయ తిన్న తర్వాత కొందరికి కడుపు భారంగా అనిపించడం సహజం. ఇలాంటి వారు ముక్కలపై కొద్దిగా నల్ల ఉప్పు చల్లుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ వేగవంతం కావడానికి సహకరిస్తుంది.

4 / 5
పండు ఎంపికలో జాగ్రత్తలు:  బయట దొరికే కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను కొనకపోవడం మంచిది. అలాగే పండుపై రంగు కోసం ఇంజెక్షన్లు ఇచ్చే ముప్పు ఉన్నందున, నమ్మకమైన చోట కొనాలి. పండు కోసిన తర్వాత నీరు కారుతున్నా లేదా వాసన వస్తున్నా దానిని తినకూడదు. వేసవిలో పుచ్చకాయ శరీరానికి అద్భుతమైన చలవను ఇస్తుంది. కానీ ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం దాని పూర్తి ప్రయోజనాలను పొందగలం.

5 / 5
Follow Us
నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. రంగంలోకి CBI దర్యాప్తు సంస్థ!

నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్

ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ

ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..

తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే

ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద

ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..

ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!

డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?

ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!