
AP Weather Report for April 22

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగ్నేయ నుంచి నైరుతి దిశలో గాలులు వీస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలలో రాబోయే 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

High Temperatures in AP

ఐఎండి అంచనాల ప్రకారం ఈరోజు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం అవకాశం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Heat

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 126: అల్లూరి జిల్లా 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16, ఏలూరు 5, గుంటూరు 6, కాకినాడ 12, కోనసీమ 1, కృష్ణా 6, ఎన్టీఆర్ 14, పల్నాడు 1, మన్యం 11, శ్రీకాకుళం 7, విశాఖ 3, విజయనగరం 18, వైయస్సార్ 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.