Rosemary Tea: ఈ టీ నిజంగా అమృతమే.. రోజూ ఉదయాన్నే ఖాళీకడుపుతో తాగితే ఊహించని లాభాలు..!

|

Dec 22, 2024 | 9:51 AM

టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం..అయినప్పటికీ చాయ్ లేకుండా ఉండలేకపోతున్నాం. అయితే, టీ అలవాటు మానేయటం కంటే.. ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద టీ తయారు చేసుకుని తీసుకోవటం వల్ల సంతృప్తితో పాటుగా, ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు. అవును, అలాంటి హెర్బల్ టీ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
రోజ్‌మేరీ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు. రోజ్‌మేరీ టీ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.

2 / 5
రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేందుకు దోహదపడుతుంది..ఎముకలు, కండరాల నొప్పుల నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. రోజ్‌మేరీ నూనెతో మసాజ్ చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

3 / 5
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. మెదడు పనితీరు కూడా బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. ముడతలు పడడం వంటి బాధలు కూడా ఉండవు.

4 / 5
రోజ్‌మేరి టీ కురులకు ఉపయోగించడం వల్ల అందమైన కురులని పొందవచ్చు. జుట్టు బాగా ఎదుగుతుంది. బలంగా, దృఢంగా ఉంటుంది. హెర్బల్ టీ మీ రోజువారీ రుచికరమైన టీ లాగా ఉండదు.  కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

5 / 5
రోజ్మేరి టీ తయారీకి కావలసింది రోజ్మేరీ ఆకులు, కొద్దిగా అల్లం. బాణలిలో నీళ్లు పోసి అందులో కొన్ని రోజ్‌మేరీ ఆకులు, దంచిన అల్లం వేయాలి. ఇప్పుడు బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత నీటి రంగు మారినట్లు మీరు చూస్తారు. ఆ తర్వాత వడకట్టి కప్పులో పోసుకుంటే.. రోజ్మేరీ టీ రెడీగా ఉంటుంది. కావాలంటే మీరు దాని ప్రయోజనాలను పెంచడానికి కాస్త తేనె, నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.