
కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు నేను శైలజా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి.

దీంతో వరసగా అవకాశాలు తలుపు తట్టాయి. ముఖ్యంగా ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తికి వరసగా ఆఫర్స్ రావడంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వరస సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

దసరా మూవీతో పాన్ ఇండి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, మహానటితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక పెళ్లికి ముందు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. అతి త్వరలో ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా డ్రెండీ డ్రెస్‌లో తన అందంతో అందరీన ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.