
ఏ వ్యక్తులు అయితే ఒకటవ తేదీ రోజున జన్మిస్తారో వారు దీపావళి పండుగ రోజున సూర్యుడి చిత్రపటం లేదా మీ చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదంట. దీని వలన అదృష్టం కలిసి వస్తుందంటున్నారు పండితులు.

నెల ఏదైనా సరే రెండవ తేదీన జన్మించిన వారు తమ ఇంటిలోనికి వాటర్ ఫౌంటెన్ తీసుకరావడం చాలా మంచిదంట. దీని వలన మీ ఇంట్లో సంపద పెరగడమే కాకుండా ,ఆర్థికం, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయంట.

మూడవ తేదీన జన్మించిన వారు దీపావళి పండుగ రోజున తప్పకుండా పసుపు లేదా విష్ణుమూర్తి విగ్రహాన్ని కొనుగోలు చేసి తమ ఇంటిలోని తీసుకొచ్చుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట.

నాలుగోవ తేదీన జన్మించిన వారు దీపావళి పండుగ సమయంలో తమ ఇంటికి వెండితో తయారు చేసిన ఏనుగు విగ్రహాన్ని తీసుకరావడం వలన పనుల్లో అడ్డంకులు తొలిగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ధనలాభం కలుగుతుందంట.

ఐదవ తేదీన జన్మించిన వారు గణేశుడి విగ్రహాన్ని దీపావళి పండుగ రోజున ఇంటిలోని తెచ్చుకోవడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయంటున్నారు పండితులు.