Hyderabad: నగరంలో ప్రారంభమైన జాతీయ పుస్తక ప్రదర్శన.. కొనేందుకు పాఠకుల ఉత్సాహం..

|

Feb 15, 2024 | 11:44 AM

హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 36వ ఎడిషన్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్‌లో జరగనుంది. పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఇందులో పుస్తక ప్రదర్శన అధ్యక్షులు, మాజీ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌ ప్రకటించారు. జనవరిలో కలకత్తాలో జరిగిన పుస్తక ప్రదర్శన 29 లక్షల మంది పుస్తక ప్రేమికులను ఆకర్షించింది.

1 / 6
హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 36వ ఎడిషన్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్‌లో జరగనుంది. పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఇందులో పుస్తక ప్రదర్శన అధ్యక్షులు, మాజీ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌ ప్రకటించారు.

2 / 6
 జనవరిలో కలకత్తాలో జరిగిన పుస్తక ప్రదర్శన 29 లక్షల మంది పుస్తక ప్రేమికులను ఆకర్షించింది. ఈ తరహాలోనే పుస్తక ప్రదర్శనలు నిర్వహించడం కోసం హైదరాబాద్ వేదికైంది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన వేదికకు ప్రముఖ కవి, ప్రజా యుద్దనౌక గద్దర్ పేరు పెట్టారు. వేదికపై సుప్రసిద్ద రచయిత, తెలుగు, సంస్కృత సాహితీవేత్త రవ్వా శ్రీహరి పేరు పెట్టారు.

3 / 6
ఎగ్జిబిషన్ ఆవరణలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పుస్తకప్రదర్శన ఫిబ్రవరి 09 నుంచి 19 వరకు 11 రోజుల పాటు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు తెరవబడుతుందని నిర్వహకులు తెలియజేశారు. వారాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు అన్ని స్టాల్స్ ప్రదర్శనలో ఉంటాయి.

4 / 6

 ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత ప్రచురణకర్తలు పాల్గొంటారు. పుస్తక ప్రియులకు 365 స్టాల్స్ ఆకర్షణీయంగా కావల్సిన విజ్ఙానాన్ని పొందేందుకు వీలుగా ఉంటుంది. పిల్లల్లో పఠనాభిమానాన్ని పెంపొందించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

5 / 6
ఈ పుస్తకప్రదర్శనలో సాహిత్య, సాంస్కృతిక, జనరల్ నాలెడ్జ్, పురాణ, ఇతిహాస, కళా, సామాజిక, వైద్య, న్యాయ, రాజకీయ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పిల్లలకు కావల్సిన పెయింటింగ్, డ్రాయింగ్, ఆర్ట్ అభ్యాసానికి సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి.

6 / 6
పిల్లలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు రెండు నుంచి నాలుగు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రాంగణానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ హాజరయ్యారు.