Beverages: వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీర్, బ్రాందీ, రమ్.. వీటిలో తేడా ఏంటో తెలుసా..

|

Oct 18, 2021 | 12:04 PM

మద్యప్రియులకు ఆ పేరు వినిపించిందంటే చాలు నాలుక లాగేస్తుంది.. మనసు గుంజేస్తుంది.. పిచ్చెక్కేస్తుంది. ఆ  మద్యంలో చాలా రకాలవి ఉంటాయి. వీటిలో..

Beverages: వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీర్, బ్రాందీ, రమ్.. వీటిలో తేడా ఏంటో తెలుసా..
Drinks
Follow us on

మద్యప్రియులకు ఆ పేరు వినిపించిందంటే చాలు నాలుక లాగేస్తుంది.. మనసు గుంజేస్తుంది.. పిచ్చెక్కేస్తుంది. ఆ  మద్యంలో చాలా రకాలవి ఉంటాయి. వీటిలో వైన్, విస్కీ, బ్రాందీ వోడ్కా, బీర్, జిన్‌తోపాటు మరెన్నో ఉన్నాయి. మద్యం తాగేవారికి.. తాగని వారికి వీటి మధ్య తేడా పెద్దగా తెలియదు. బీర్, వోడ్కా, వైన్ కాకుండా అనేక రకాలు ఇందులో ఉన్నాయి. వాటిలో ఆల్కహాల్ మారిపోతుంది. అసలు వీటి మధ్య ఏం తేడా ఉందో తెలుసకుందాం. వాటిలో ఎంత ఆల్కహాల్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో మీరు చాలా వరకు అర్థం చేసుకుంటారు.

ఇందులో ప్రధానంగా రెండు రకాల ఆల్కహాల్స్ ఉంటాయి. వీటిలో వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. ఒకటి అన్ డిస్టిల్డ్ డ్రింక్స్ (Undistilled Beverages), మరొకటి డిస్టిల్డ్ డ్రింక్స్(distilled Beverages). బీర్, వైన్, హార్డ్ సైడర్ వంటి మద్యం అన్ డిస్టిల్డ్ డ్రింక్స్ కిందికి వస్తాయి. అదే సమయంలో డిస్టిల్డ్ డ్రింక్స్‌లలో బ్రాందీ, వోడ్కా, టేకిలా రమ్ మొదలైనవి వస్తాయి. డిస్టిల్డ్ డ్రింక్స్‌లకు గడువు తేదీ ఉండదు. ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. మరో విషయం అన్ డిస్టిల్డ్ డ్రింక్స్ తేదీ ముగిసిన తర్వాత చెడిపోతాయి.

అన్ డిస్టిల్డ్ డ్రింక్స్

బీర్- ఆల్కహాలిక్ పదార్థాలలో బీర్ లెక్కించబడుతుంది. బీర్‌లో ఆల్కహాల్ మొత్తం 4 నుంచి 6 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనిలో కూడా ఇది తేలికపాటి బీర్‌లో తగ్గించబడుతుంది. ఇతర బీర్లలో ఇది 8 శాతం వరకు ఉంటుంది.

వైన్- వైన్ చాలా ప్రజాదరణ పొందిన ఆల్కహాలిక్ డ్రింక్. వైన్‌లో 14 శాతం వరకు ఆల్కహాల్ పరిగణించబడుతుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి . ఇందులో వివిధ మొత్తాలు ఉండవచ్చు. పోర్ట్ వైన్, షెర్రీ వైన్, మేడిరా వైన్, మార్సలా వైన్ మొదలైనవి. కొన్ని వైన్లలో 20 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది.

హార్డ్ సైడర్- ఇది ఒక రకమైన ఆపిల్ రసంగా పరిగణించ్చు. ఇందులో 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

డిస్టిల్డ్ డ్రింక్స్

జిన్- జిన్ జునిపెర్ బెరిజ్‌తో తయారు చేయబడింది. ఇందులో 35 నుంచి 55 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

బ్రాందీ – బంద్రీ ఒక రకమైన డిస్టిల్డ్ డ్రింక్. ఇందులో 35 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

విస్కీ- విస్కీ పులియబెట్టిన ధాన్యాల నుండి తయారవుతుంది. ఇందులో 40 నుంచి 50 శాతం ఆల్కహాల్ ఉంటుంది.

రమ్- రమ్ పులియబెట్టిన చెరకు మొదలైన వాటి నుండి తయారవుతుంది. ఇందులో 40 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. కానీ అధిక ఆల్కహాల్ కంటెంట్.. 60-70 శాతం ఆల్కహాల్ కలిగి ఉన్న అనేక ఓవర్‌ప్రూఫ్ రమ్‌లు కూడా ఉన్నాయి.

టేకిలా- ఇది కూడా ఒక రకమైన లిక్కర్. ఇది మాక్సిన్ కిత్తలి మొక్క నుండి తయారు చేయబడింది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ 40 శాతం వరకు ఉంటుంది.

వోడ్కా- వోడ్కా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది తృణధాన్యాలు, బంగాళాదుంపలతో తయారు చేయబడింది. ఇందులో ఆల్కహాల్ మొత్తం 40 శాతం వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Business Ideas: బిజినెస్ మొదలు పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారా.. ఈ ఐడియా మీ కోసమే.. చిన్న పెట్టుబడితో లక్షలు సంపాధించండి..

Chanakya Niti: ఇలాంటి డబ్బును ఎప్పుడూ ముట్టుకోకండి.. వినకుండా టచ్ చేస్తే ఇక అంతే..