Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్‌ విపత్తు అప్డేట్ : తపోవన్‌ టన్నెల్‌ దగ్గర ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యం, ఇంకా దొరకని 179 మంది జాడ

Uttarakhand flash floods updates : ఉత్తరాఖండ్‌లో వరుసగా నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. చిమ్మ చీకట్లో కూడా ప్రాణాలకు తెగించి

ఉత్తరాఖండ్‌ విపత్తు అప్డేట్ : తపోవన్‌ టన్నెల్‌ దగ్గర ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యం, ఇంకా దొరకని 179 మంది జాడ
'చమోలీ'.. జల విలయం
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 10, 2021 | 10:09 PM

Uttarakhand flash floods updates : ఉత్తరాఖండ్‌లో వరుసగా నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. చిమ్మ చీకట్లో కూడా ప్రాణాలకు తెగించి సహాయక సిబ్బంది గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. అయినప్పటికి నా ఇంకా 179 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు..మరోవైపు జల విలయానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఉత్తరాఖండ్‌లో హిమానీనది ఉప్పొంగడంతో మృతి చెందిన వారి సంఖ్య 36కు చేరింది. తపోవన్‌ టన్నెల్‌ దగ్గర బురద మేటలు వేసింది. తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా జారిపడుతోంది. గల్లంతైన కార్మికుల కుటుంబసభ్యులు అల్లాడిపోతున్నారు. నాలుగు రోజుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఒక్క తపోవన్‌ టన్నెల్‌ వద్దే 35 మంది వరకు జాడ తెలియడం లేదు. వారికోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీబృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇంకా జాడ తెలియని వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐతే అత్యంత సాహసోపేతంగా ఆ ప్రాంతానికి చేరుకుంది టీవీ9 టీమ్‌. ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది.

జేబీసీలు, అధునాతన యంత్రాలతో బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ టీమ్‌. 150 మీటర్ల వరకు బురదను తొలగించారు. ఐతే తపోవన్‌ టన్నెల్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తీస్తున్న కొద్దీ లోపలి నుంచి జారిపడుతోంది బురద. మరోవైపు జాగిలాలతోనూ కార్మికుల జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ట్రైనింగ్‌ తీసుకున్న జర్మన్‌ షెఫర్డ్‌ జాగిలాలను వినియోగిస్తున్నారు. శునకాలతో కార్మికుల కోసం గాలింపు జరుగుతోంది.

ఇక ఉత్తరాఖండ్‌ జల ప్రళయంతో సమీప ప్రాంత ప్రజలకు రాకపోకలు స్తంభించిపోయాయి. తపోవన్‌ వద్ద ఓ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో..అక్కడున్న గ్రామానికి రాకపోకలకు వీల్లేని పరిస్థితేర్పడింది. దీంతో వారి కోసం రోప్‌ వేను ఏర్పాటుచేస్తున్నారు. ఉత్తరాఖండ్‌ – చైనా సరిహద్దు లోని చిట్టచివరి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. హెలికాప్టర్లతో నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. హిమనీనదం సృష్టించిన జలవిలయంతో పలు గ్రామాలకు.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి ప్రజలకు.. ఐటీబీపీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి.. వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

ఫిబ్రవరి 7న జలప్రళయం ధాటికి ఛమోలీ సహా చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విష్ణుప్రయాగ్​లోని పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలకు బీటలు వారాయి. రిషిగంగ ప్రాజెక్ట్​ దగ్గర పనిచేసే సుమారు 40 మంది కార్మికుల కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. అలకనందా నదీ వద్ద జలవిలయం అనంతరం.. సహాయక చర్యలు సక్రమంగా చేపట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్​ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఇదికూడా చదవండి : బిగ్ బ్రేకింగ్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో దారుణం, ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై ఆటో డ్రైవర్ అత్యాచారం