Jai Shankar: ఉక్రెయిన్‌పై భారత తటస్థ వైఖరి సరియైనదేనంటూ ప్రపంచ దేశాలను ఒప్పించిన దిట్ట జైశంకర్..

|

Apr 16, 2022 | 9:19 PM

Jai Shankar: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్ని యుద్ధం విషయంలో భారత్‌ తీసుకున్న తటస్థ వైఖరిని మొదట్లో కొన్ని దేశాలు వ్యతిరేకించినా ఇప్పుడు మెజారిటీ దేశాలు భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో జరిగిన చర్చల నేపథ్యంలో భారత్‌ తాను కట్టుబడి..

Jai Shankar: ఉక్రెయిన్‌పై భారత తటస్థ వైఖరి సరియైనదేనంటూ ప్రపంచ దేశాలను ఒప్పించిన దిట్ట జైశంకర్..
Jai Shankar
Follow us on

Jai Shankar: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్ని యుద్ధం విషయంలో భారత్‌ తీసుకున్న తటస్థ వైఖరిని మొదట్లో కొన్ని దేశాలు వ్యతిరేకించినా ఇప్పుడు మెజారిటీ దేశాలు భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో జరిగిన చర్చల నేపథ్యంలో భారత్‌ తాను కట్టుబడి ఉన్న నిర్ణయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. భారత్‌, అమెరికాల మధ్య 2+2 విధానంలో రక్షణ(Defence), విదేశాంగ(Foreign Affairs) మంత్రులు సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయమై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందించిన జైశంకర్.. ‘భారత్ రష్యా నుంచి ఒక నెలలో కొనుగోలు చేస్తున్న చమురు మొత్తం యూరప్‌ ఒక పూటలో కొనుగోలు చేసే దానితో సమానం. కాబట్టి మీరు భారత్‌ కొనుగోలు చేసే చమురు గురించి కాకుండా యూరప్‌ గురించి ఆందోళన చెందండి’ అంటూ బదులిచ్చారు. కొనుగోలు చేసే చమురు గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. కానీ, యూరప్ ఒకపూటలో కొనుగోలు చేసేంత చమురును…. భారత్ ఒక నెలలో కూడా కొనుగోలు చేయదు. కాబట్టి మీరు యూరప్ గురించి ఆందోళన చెందండి” అని ఆయన బదులిచ్చారు. దీంతో జైశంకర్ ఇచ్చిన ఈ సమాధనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాకుండా భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై కూడా జైశంకర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘2+2 సమావేశంలో భారత్‌లోని మానవ హక్కులపై ఎలాంటి చర్చ జరగలేదు. మన గురించి సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే హక్కు వారికి ఉంటుంది. అదే విధంగా, వారిపై మనకున్న అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు మనకూ ఉంది’ అంటూ సూటిగా సమాధానం ఇచ్చారు.

జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జైశంకర్ గురించి దేశం చర్చించుకునేలా చేస్తున్నాయి. జైశంకర్ ను  విదేశాంగ మంత్రిగా నియమిస్తూ మే 31,2019న ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఇంతటీ గొప్ప నిర్ణయంగా మారుతుందని బహుశా ఆరోజు ఎవరూ అనికొని ఉండరు. జైశంకర్ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా 1977లో సర్వీసులో చేరారు. అనంతరం 1979 నుంచి 1981 వరకు ఇండియన్‌ మిషన్‌ టు సోవియట్‌ యూనియన్‌లో సెక్రటరీగా పనిచేశారు. అనంతరం భారతదేశానికి సుమారు మూడు దశాబ్ధాల పాటు దౌత్యవేత్తగా సేవలందించారు. మాస్కో, వాషింగ్టన్‌, బీజింగ్‌తో పాటు మరెన్నో దేశాల్లో ఆయన పని చేశారు. జయశంకర్‌కు హిందీ, తమిళం, రష్యన్‌, ఇంగ్లిష్‌, చైనీస్‌, జపనీస్‌, హంగేరియన్ భాషలు మాట్లాడగల నేర్పరి.

జైశంకర్ దౌత్వవేత్తగా పనిచేస్తున్న తొలినాళ్లలో శ్రీలంక దేశ సమస్యలను పరిష్కరించారు. అంతేకాకుండా జైశంకర్ మంచి మాటకారి కూడా, ఎదుటి వారు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగల నేర్పరి. 2+2 సమావేశం తర్వాత విలేఖర్ల సమావేశంలోకానీ, మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా చెప్పిన సమాధానమే దీనికి నిదర్శనం. భారతదేశంపై పాశ్చాత్య దేశాల ఒత్తిడిని తగ్గించే క్రమంలో జైశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉక్రెయిన్‌పై భారత్‌ తటస్థ వైఖరిని జైశంకర్ మరోసారి పునరుద్ఘాటించారు. భారత ఖ్యాతిని మరింత పెంచుతోన్న జైశంకర్ నిర్ణయాలు భవిష్యత్తుల్లో ఇంకెన్ని మార్పులకు దారి తీస్తుందో చూడాలి.

Also Read: Pakistan PM Letter: ప్రధాని మోదీ లేఖకు సమాధానం ఇచ్చిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఏమన్నారంటే..?

Sabita Indrareddy: కాన్వాయ్ అపి కరుణ చూపిన సబితమ్మ.. కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులకు చేయూత..

Alia Bhatt : తారక్‌కు షాక్ ఇచ్చిన అలియా.. ఎన్టీఆర్30 నుంచి బాలీవుడ్ భామ అవుట్.. కారణం ఇదేనా..