HDFC Bank: హెచ్​డిఎఫ్​సి బ్యాంక్ 4వ త్రైమాసిక ఫలితాలు విడుదల.. 23 శాతం పెరిగిన లాభం..

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి(HDFC) బ్యాంక్ మార్చి 2022 తో ముగిసిన త్రైమాసిక(Q4 Results) ఫలితాలు ప్రకటించింది...

HDFC Bank: హెచ్​డిఎఫ్​సి బ్యాంక్ 4వ త్రైమాసిక ఫలితాలు విడుదల.. 23 శాతం పెరిగిన లాభం..
Hdfc Bank
Follow us
KVD Varma

| Edited By: Srinivas Chekkilla

Updated on: Apr 16, 2022 | 5:38 PM

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి(HDFC) బ్యాంక్ మార్చి 2022 తో ముగిసిన త్రైమాసిక(Q4 Results) ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో లాభం(Profit) 23 శాతం పెరిగి రూ .10,055.2 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ లాభం రూ.8,186.51 కోట్లు. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 10.2 శాతం పెరిగి రూ. 18,872.7 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.17,120 కోట్లుగా ఉంది.

ఈ నెల ప్రారంభంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 20.9 శాతం పెరిగి రూ .13.69 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. బ్యాంకు రిటైల్ రుణాలలో వృద్ధి 15 శాతం, వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్ రుణాలలో వృద్ధి 30.5% నమోదు చేసింది. బ్యాంకు కార్పొరేట్, ఇతర హోల్‌సేల్ రుణాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 17.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

డిపాజిట్లలో 16.8% వృద్ధి

మార్చి 2022 వరకు బ్యాంకు డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 16.8 శాతం పెరిగాయి. ఇందులో రిటైల్ డిపాజిట్లు 18.5 శాతం పెరిగాయి. కాగా, హోల్‌సేల్ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మార్చి 2022 నాటికి CASA డిపాజిట్ల వాటా రూ.7.51 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన దాదాపు 22 శాతం వృద్ధిని సాధించింది. కాగా, మార్చి 2022 త్రైమాసికంలో CASA డిపాజిట్ల నిష్పత్తి 48 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 46.1 శాతంగా ఉందని బ్యాంక్ తెలిపింది.

Read Aslo.. Multibagger Returns: ఏడాదిలో లక్షను.. రూ.2.79 లక్షలను చేసి బంపర్ రిటర్న్స్ ఇచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!