RBI Alert: ఆ నోట్లు ఉన్న వారికి RBI అలర్ట్.. వెంటనే అలా చేయాలని సూచన..

RBI Alert: మీ దగ్గర పాడైన లేదా పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా. అయితే ఈ వార్త మీ కోసమే. ఈ విషయంలో రిజర్వు బ్యాంక్ కొన్ని కీలక సూచనలు చేసింది. పూర్తి వివరాలు..

RBI Alert: ఆ నోట్లు ఉన్న వారికి RBI అలర్ట్.. వెంటనే అలా చేయాలని సూచన..
Rbi Jobs
Follow us

|

Updated on: Apr 16, 2022 | 4:01 PM

RBI Alert: మీ దగ్గర పాత నోట్లు, చిరిగిన నోట్లు(Spoiled Notes) ఉన్నాయా? వాటిని ఏమి చేయాలో తెలియటం లేదా? వాటిని బ్యాంకులో మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది చిరిగిన నోట్లు తమ వద్దకు వస్తే వాటికి ఆర్టీసీ బస్సుల్లో, పెట్రోల్ బంకుల్లో ఎలాగొలా మార్చాలని చూస్తుంటారు. తమ వద్దే ఉంచుకుంటే వాటికి విలువ ఉండదేమోనని భ్రమ పడుతుంటారు. కరెన్సీ నోట్లు చిరిగినా దాని విలువ చెక్కుచెదరదుని గుర్తుంచుకోండి. కాబట్టి వాటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్చుకోవచ్చు. మీ దగ్గర ఉన్న చిరిగిన నోటును మరొకరికి ఇస్తే వాళ్లు కూడా ఇదే సమస్య ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అందుకే చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం మంచిది. పాతనోట్లే కాదు కొన్నిసార్లు బట్టల్లో మరిచి పోయి ఉతకటం వల్ల, ఇంట్లో చిన్నపిల్లలు చింపేయటం లాంటి వాటి వల్ల కూడా కరెన్సీ నోట్లు చిరిగిపోతుంటాయి. దీనికి తోడు.. ప్రస్తుతం ప్రజలు డిజిటల్ చెల్లింపులకు(Digital Payments) ఎక్కువగా అలవాటు పడినందున అనేక మంది తమ వద్ద చిరిగిన నోట్లు ఉంటే వాటిని ఏ బీరువాలోనో, పర్సులోనో పెట్టి మరిచిపోయి ఉంటారు. ఇలా చిరిగిన నోట్లను వెంటనే దగ్గరలోని ఏదైనా బ్యాంకులో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమనిబంధనల ప్రకారం చిరిగిన నోట్ల, పాత బడిన నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. మురికిగా మారిన, చిరిగిన నోట్లను బ్యాంకులో ఇచ్చి వాటికి బదులు కొత్త నోట్లను పొందవచ్చు. చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవటం, కరెన్సీ నోట్లు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవటం గురించి యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆర్‌బీఐ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Rapido: ర్యాపిడోలో దిగ్గజ ఆటోమెుబైల్ కంపెనీ భారీ పెట్టుబడి.. డీల్ విలువ ఎంతంటే..

Multibagger Returns: ఏడాదిలో లక్షను.. రూ.2.79 లక్షలను చేసి బంపర్ రిటర్న్స్ ఇచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్..!