Rapido: ర్యాపిడోలో దిగ్గజ ఆటోమెుబైల్ కంపెనీ భారీ పెట్టుబడి.. డీల్ విలువ ఎంతంటే..
Rapido: ర్యాపిడోలో దేశీయ దిగ్గజ టూవీలర్ కంపెనీ కొత్తగా పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా బైక్ రైడింగ్ సర్వీస్ సంస్థ ర్యాపిడో తన సేవలను మరింత విస్తరించనుంది. ఈ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు..
Rapido: రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ఆధారంగా బైక్ టాక్సీ యాప్ Rapido ఫుడ్ డెలివరీ కంపెనీ Swiggy నేతృత్వంలో సిరీస్-D రౌండ్ ఫండింగ్ లో 180 మిలియన్ డాలర్లను సేకరించింది. ఈ రౌండ్‌లో దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ లిమిటెడ్ కొత్త పెట్టుబడిదారుగా చేరింది. ప్రస్తుతం పెట్టుబడి దారులుగా ఉన్న వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, నెక్సస్ వెంచర్స్, షెల్ వెంచర్స్ సరసన TVS మోటార్ చేరింది. ఈ విషయాన్ని Rapido ఇంకా వెల్లడించలేదు. రాపిడో పెట్టుబడి విలువ ప్రస్తుతం 830 మిలియన్ డాలర్ల ఒప్పందాల గురించి తెలిసిన అంతర్గత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ విలువలో TVS మోటార్ 15 మిలియన్ డాలర్లు, వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ 30 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా.. మిగిలిన మెుత్తాన్ని నెక్సస్ వెంచర్స్, షెల్ వెంచర్స్ పెట్టుబడి పెట్టాయి.
కరోనా కారణంగా వచ్చిన ఇబ్బందుల వల్ల తాత్కాలిక విరామం తర్వాత దేశీయ మొబిలిటీ సంస్థలోకి మళ్లీ పెట్టుబడిదారుల ఆసక్తిని రాపిడో డీల్ హైలైట్ చేస్తుంది. గత అక్టోబర్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్-టెక్ సంస్థ చలో లైట్‌రాక్ ఇండియా, ఫిల్టర్ క్యాపిటల్ నేతృత్వంలోని సిరీస్-C రౌండ్‌లో 40 మిలియన్ డాలర్లను సేకరించింది. చలో కూడా మార్చిలో.. స్కూటర్ రెంటల్ స్టార్టప్ వోగోను కొనుగోలు చేసింది. అక్టోబర్‌లో బస్ అగ్రిగేటర్ షటిల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. అలాగే రైడ్-హెయిలింగ్ కంపెనీ Ola ఇటీవల యాక్సిస్ గ్రోత్ అవెన్యూస్ AIF, యారో మల్టీ-అసెట్ ఫండ్ నుంచి దాని కొనసాగుతున్న సిరీస్- J రౌండ్‌లో 150 కోట్ల రూపాయలను సేకరించింది.
మెట్రోలతో పాటు టైర్-I, II, III నగరాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, సాంకేతికతను మెరుగుపరిచేందుకు, వర్క్ ఫోర్స్ మెరుగుపరిచేందుకు ఈ మెుత్తాన్ని కంపెనీ వినియోగించనుంది. ఈ డబ్బును టాక్సీ, ఆటో, డెలివరీ విభాగాల్లో వినియోగించనుంది. దేశ వ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు స్విగ్గీ నుంచి మెళకువలను నేర్చుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇవీ చదవండి..
Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!
Health Tips: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!