AP Municipal Elections 2021 : విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో గెలుపు ఎవరిది.? ఉక్కు దెబ్బ ఎవరికి.? బీజేపీ, జనసేన ఎఫెక్ట్‌ ఏ పార్టీకి.?

|

Mar 11, 2021 | 12:53 PM

AP Municipal Election results 2021 : పట్టణ ఓటర్ల తీర్పు ఏంటో డిసైడైపోయింది. కాకపోతే అది ఏంటో తేలాల్సి ఉంది. అందుకోసం మరో రెండు రోజులు ఆగాలి. అదే అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచేస్తోంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రంగా ఉన్న బ్యాలెట్..

AP Municipal Elections 2021 :  విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో గెలుపు ఎవరిది.?  ఉక్కు దెబ్బ ఎవరికి.? బీజేపీ, జనసేన ఎఫెక్ట్‌ ఏ పార్టీకి.?
AP Municipal Elections 2021
Follow us on

AP Municipal Election results 2021 : పట్టణ ఓటర్ల తీర్పు ఏంటో డిసైడైపోయింది. కాకపోతే అది ఏంటో తేలాల్సి ఉంది. అందుకోసం మరో రెండు రోజులు ఆగాలి. అదే అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచేస్తోంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రంగా ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓటర్ల తీర్పు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు నేతలు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. 70 మున్సిపాల్టీల్లో, 11 కార్పొరేషన్లకు కౌంటింగ్‌ జరుగుతుంది. చిలకలూరిపేట మున్సిపాల్టీ, ఏలూరు కార్పొరేషన్‌లో కౌంటింగ్‌ను హైకోర్టు ఆదేశాలను బట్టి తర్వాత చేపడతారు. మొత్తం 75 మున్సిపాల్టీల్లో 4 మున్సిపాల్టీలు ఏకగ్రీవం అయ్యాయి. కార్పొరేషన్లలో కన్నా… మున్సిపాల్టీల్లోనే ఎక్కువగా పోలింగ్‌ నమోదైంది. 12 కార్పొరేషన్లలో 57.14 శాతం ఓట్లు పోలైతే.. కార్పొరేషన్లలో 62.28 శాతం పోలింగ్‌ జరిగింది.

రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లలో తీర్పే అత్యంత ఉత్కంఠ రేపుతోంది. విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది. స్టీల్‌ సిటీలో ఉక్కు ఉద్యమం దెబ్బ ఎవరికి పడుతుందో ఆదివారం తేలుతుంది. బీజేపీ, జనసేనకు ఎఫెక్ట్‌ తప్పదనే అంచనా ఉంది. వైసీపీకి ఇబ్బందులు తప్పవా… అనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. కార్మికుల ఆందోళన గ్రేటర్‌ విశాఖలో గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపిందనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

ఇక విజయవాడ, గుంటూరుల్లో అమరావతి ప్రభావం ఎంత ఉందనేది తేలాల్సి ఉంది. ఇక్కడ గెలుపు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. చంద్రబాబు రెండు చోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. పౌరుషం లేదా అంటూ ఓటర్లను ప్రశ్నించారు. మరి ఈ రెండు కార్పొరేషన్లలో జనం ఏం తీర్పు ఇచ్చారనేది ఆసక్తిగా మారింది. వైసీపీకి కూడా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో గెలుపు సవాలే. కచ్చితంగా ఈ రెండు తమవేననే ధీమాతో ఉంది అధికార పార్టీ. అసలు ఏ ఒక్క మున్సిపాల్టీ కూడా టీడీపీకి దక్కదని, అన్నీ తమవేనని చెబుతోంది వైసీపీ.

Read also : ఒక్క ప్రకటన ఉద్యమానికి వేయి ఏనుగుల బలమైంది.. విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, కటౌట్లు, హర్షాతిరేకాలు