Moon Name Secret: చంద్రుడిని ‘చందమామ’ అని ఎందుకు పిలుస్తారు? పెరు వెనుక షాకింగ్ రహస్యం ఇదే..

|

Sep 11, 2022 | 7:30 AM

Moon Name Secret: పసిపిల్లలు అన్నం తినడంలో మారాం చేస్తుంటే.. ‘చందమామ రావే, జాబిల్లి రావె’ అని అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు పాడుతుండటం..

Moon Name Secret: చంద్రుడిని ‘చందమామ’ అని ఎందుకు పిలుస్తారు? పెరు వెనుక షాకింగ్ రహస్యం ఇదే..
Moon
Follow us on

Moon Name Secret: పసిపిల్లలు అన్నం తినడంలో మారాం చేస్తుంటే.. ‘చందమామ రావే, జాబిల్లి రావె’ అని అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు పాడుతుండటం చాలా సందర్భాల్లో చూస్తేనే ఉంటాం. ఇక వేసవి రాత్రుల్లో డాబా పై పడుకుని, ఇంట్లోని పెద్దలు చందమామను చూపిస్తే కథలు, లాలిపాటలు పడుతుంటారు. చందమామ అంటే పిల్లలకు చాలా ఇష్టం. అందుకే, వారు ఏడిస్తే వెంటనే చందమామను చూపిస్తారు పెద్దలు. ఆ చందమామను చూస్తూ కడుపు నిండా భోజనం చేస్తారు. మరి పిల్లలకు, చంద్రుడికి అంత సాన్నిహిత్యం, అనుబంధం ఎందుకు ఉంది? చంద్రుడిని ‘మామ’ అనే ఎందుకు అంటారు? ఈ ‘మామ’ వెనకున్న రహస్యం ఏంటి? ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

చంద్రుడిని ‘మామ’ అని ఎందుకు అంటారు?

చంద్రుడిని మామ అని పిలవడం వెనుక మతపరమైన, పౌరాణిక, భౌగోళిక కారణాలున్నాయి. చంద్రుడిని లక్ష్మీ దేవి సోదరుడిగా భావిస్తారు. మనమందరం లక్ష్మిని ‘అమ్మ’గా భావిస్తాం. కావున, మన సంబంధాల పరంగా, చంద్రునితో సంబంధం ‘మామ’గా మారుతుంది. ఇదే చందమామ అని పిలవడానికి కారణంగా పేర్కొంటారు. ఇక భౌగోళిక కారణానికి వస్తే.. భూమి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. భూమి చుట్టూ తిరుగుతుంది. సోదరుడు, సోదరి సంబంధాన్ని గమనిస్తే.. సోదరుడు ఎల్లప్పుడూ తన సోదరి వెన్నంటి ఉంటాడు. ఆమెతో కలిసి ఆడుకుంటూ, ముందుకు సాగుతాడు. ఈ నేపథ్యంలోనే.. చంద్రుడు, భూమి(భూదేవి) తిరుగుతున్న తీరును బట్టి సోదర, సోదరీ సంబంధం పెనవేసుకుందని అంటారు. ఇలా భూమిని తల్లి అని పిలవడం వలన, చంద్రుడిని మామ అని పిలవడం మొదలుపెట్టారు. ఇలా ‘చందమామ’ అని వచ్చిందన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..