Viral News: ప్రపంచంలోనే ‘అత్యంత ఖరీదైన ఇల్లు’.. ఒక నెల అద్దె ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయంతే..

|

May 31, 2022 | 6:10 AM

World Most Expensive House: 775 గదుల బకింగ్‌హామ్ ప్యాలెస్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది. దీనిని కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలిస్తే భారీ షాక్ తగలనుందని మెక్‌కార్తీ స్టోన్ పేర్కొంది.

Viral News: ప్రపంచంలోనే ‘అత్యంత ఖరీదైన ఇల్లు’.. ఒక నెల అద్దె ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయంతే..
World Most Expensive House
Follow us on

బ్రిటన్ రాజకుటుంబం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కానీ, ప్రజలు వారి ప్యాలెస్ పట్ల ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు. నివేదికల ప్రకారం, బ్రిటీష్ రాజ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ గురించి ఒక స్టడీ బయటకు వచ్చింది. ఇది బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన అధికారిక నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడంపై చేసిన సర్వే వివరాలను వెల్లడించింది. ఫలితాలు చూస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతానడంలో సదేహం లేదు.

అయితే, బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన నివాస ఆస్తి అని తెలిసిందే. కాగా, ఇది అమ్మకానికి లేదా అద్దెకు అందుబాటులో లేదని పేర్కొంది. మెక్‌కార్తీ స్టోన్ అధ్యయనం ప్రకారం, ఇందులో మొత్తం 775 గదులు ఉన్నాయి. బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను కొనుగోలు చేయాలంటే £1.3 బిలియన్లు (రూ. 130 కోట్లు) ఖర్చవుతాయి. కాగా, కరోనా మహమ్మారి ముందు పోలిస్తే, 100 మిలియన్ పౌండ్లు పెరిగింది.

ప్రాపర్టీ డెవలపర్‌ల అంచనాల ప్రకారం, బ్రిటన్ రాజకుటుంబాల మొత్తం విలువ 2022లో £3.7 బిలియన్లకు చేరుకుంటుంది. 2019 నుంచి 46 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

బ్రిటన్ రాయల్ ఎస్టేట్‌లలో ప్యాలెస్‌లు, లాడ్జీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. రాజకుటుంబం ఎప్పుడైనా బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను అద్దెకు తీసుకోవాలనుకుంటే, దాని అద్దె నెలకు 2.6 మిలియన్ పౌండ్లు( సుమారు రూ. 27 కోట్లు)గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అధ్యయనం కోసం సమీక్షించిన ఆస్తులు ఏవీ అమ్మకానికి లేదా అద్దెకు అందుబాటులో లేవు. రాచరికపు ఆస్తి హౌస్ ఆఫ్ విండ్సర్ వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది UK ఆస్తి, ఇది ట్రస్ట్ కింద నడుస్తుంది. బ్రిటన్‌లో క్వీన్స్ ప్లాటినం జూబ్లీని జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ అధ్యయనం జరిగింది.