కడక్ ఛాయ్, మసాలా ఛాయ్, అల్లం ఛాయ్.. ఇలా రకరకాల ఛాయ్‌లను వేడివేడిగా చాలాసార్లు తాగి ఉంటారు. వెదురు ఆకులతో చేసిన గుమగుమలాడే టీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. అసలు దీని గురించి విన్నారా ..? అలాంటి ఓ స్పెషల్ టీ గురించి మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాం. వెదురు ఆకుల నుంచి మంచి రుచి కలిగిన టీ తయారు చేస్తున్నారు త్రిపురకు చెందిన గిరిజన వ్యాపారి సమీర్ జమాతియా. ఈ పానీయానికి ఛాయ్ ప్రియులు సహా ఇతర రాష్ట్రాల్లోని వర్తకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించేందుకు వారు ఇంట్రస్ట్ చూపుతున్నారు.
గోమటి జిల్లా గర్జీకి చెందిన సమీర్.. బ్యాంబూ సాంకేతిక నిపుణుడు. జాబ్ నిమిత్తం చైనాలో చాలా కాలం ఉన్నాడు. జపాన్, వియత్నాం, కాంబోడియాలోనూ పర్యటించారు. అక్కడ సంపాదించిన అనుభవంతో వెదురు టీని తయారు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి ఢిల్లీకి చెందిన ఓ ఎగుమతిదారునికి 500 కిలోలు సరఫరా చేసినట్లు చెప్పాడు సమీర్. తమిళనాడుకు చెందిన మరో వ్యాపారి వెదురు టీ తయారీ ప్రక్రియ నేర్చుకోవడానికి 3 రోజుల త్రిపురలోనే ఉన్నట్లు తెలిపాడు. ఈ స్పెషల్ ఛాయ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయోటిక్లు అధికంగా ఉంటాయని సమీర్ చెప్పాడు 30 రకాల వెదురులతో ఈ పానీయాన్ని తయారు చేయవచ్చని వివరించాడు. టీ అంటే చాలామందికి ఓ ఎమోషన్.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీని ఓ సారి టేస్ట్ చేసేయ్యండి.
Also Read: ఏపీలో కొత్తగా 12,994 పాజిటివ్ కేసులు.. మరణాలు, పాజిటివ్ కేసుల వివరాలు