భ‌లే విచిత్రం.. ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?

|

Apr 22, 2021 | 5:36 PM

రెండు దేశాల మధ్య వివాదం  కొత్త విషయం కాదు. కొన్నిసార్లు ఈ వివాదాలు సరిహద్దు గురించి, నీటి గురించి, కొన్నిసార్లు వ్యాపారం, కొన్నిసార్లు అడ‌వుల గురించి కూడా ఉంటుంది.

భ‌లే విచిత్రం..  ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్ధం.. ఎందుకంటే..?
The Whisky War
Follow us on

రెండు దేశాల మధ్య వివాదం  కొత్త విషయం కాదు. కొన్నిసార్లు ఈ వివాదాలు సరిహద్దు గురించి, నీటి గురించి, కొన్నిసార్లు వ్యాపారం, కొన్నిసార్లు అడ‌వుల గురించి కూడా ఉంటుంది. మానవులు ఒకరి భూమిని ఆక్రమించుకోవడానికి శతాబ్దాలుగా పోరాడుతున్నారు. కాగా ఒక‌ ఐస్‌లాండ్ గురించి కూడా దశాబ్ధాల త‌ర‌బ‌డి వివాదం న‌డుస్తుంది. దాన్ని ద‌క్కించుకునేందుకు గత 30 సంవత్సరాలుగా రెండు దేశాలు రక్తం కాకుండా మద్యం దార‌బోస్తున్నాయి. అవును, ఆర్కిటిక్ యొక్క ఉత్తరాన ఎడారిగా ఉన్న ‘స్వాన్ ఐలాండ్’ ఆక్రమణ కోసం యుద్ధం ఈ త‌రహాలో జరుగుతోంది.

హాఫ్ స్క్వేర్ మైలులో విస్తరించి ఉన్న హన్స్ ద్వీపం కెనడా, డెన్మార్క్‌లను వేరుచేసే 22-మైళ్ల వెడల్పు గల నరేస్ జలసంధి మధ్యలో మూడు ద్వీపాలలో భాగంగా ఉంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం, రెండు దేశాలకు తమ తీరానికి 12 కిలోమీటర్ల వరకు విస్తీర్ణంపై హక్కులు ఉన్నాయి. ఈ ద్వీపం డెన్మార్క్, కెనడా రెండింటి సముద్ర ప్రాంతాల ప‌రిధిలోకి వస్తుంది. ఈ కారణంగా రెండు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. 1933 లో, లీగ్ ఆఫ్ నేషన్స్ ఈ విషయంలో డెన్మార్క్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ లీగ్ ఆఫ్ నేషన్స్ ముగిసిన తరువాత, ఆ నిర్ణయానికి కూడా అంత ప్రాముఖ్య‌త ల‌భించ‌లేదు.

తన దేశం యొక్క జెండాతో వైన్ బాటిల్ వదిలి…..

1984 లో డానిష్ మంత్రి హన్స్ ద్వీపాన్ని సందర్శించినప్పుడు ఈ వైన్ యుద్దం మొద‌లయ్యింది. అతను అక్కడికి వెళ్లి ఒక డానిష్ జెండాను ఎగ‌రేసి, ‘వెల్‌కమ్ టు డానిష్ ఐస్లాండ్’ అని రాసి… ఒక బాటిల్ వైన్ వదిలిపెట్టాడు. దీని తరువాత, డానిష్ సైనికులు కూడా హన్స్ ద్వీపానికి చేరుకుని తమ దేశం జెండాను అక్క‌డ ఎగ‌రేసి ‘వెల్‌కమ్ టు కెనడా’ అని రాశారు. దీనితో పాటు, వారు కూడా మద్యం బాటిల్ వదిలివెళ్లారు.

అప్పటి నుండి, రెండు దేశాల మధ్య విస్కీ యుద్ధం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఇరు దేశాల సైనికులు ఇక్కడకు వచ్చి ఇదే తంతు కొన‌సాగిస్తున్నారు. డానిష్ సైనికులు వచ్చినప్పుడు, వారు తమ దేశంలో త‌యారైన‌ వైన్ బాటిల్ అక్క‌డ‌ వదిలివెళ్తారు. కెనడియన్ సైనికులు వచ్చినప్పుడు అదే విధంగా, వారు తమ దేశానికి చెందిన మద్యం బాటిల్‌ను వదిలివెళ్తారు. ఈ విధంగా, ఈ ప్రాంతంలో ఆయుధాలతో కాకుండా మద్యం సీసాలతో యుద్దం జ‌రుగుతుంది.